Home వార్తలు BSNL : బీఎస్ఎన్ఎల్ దుస్థితికి కారణం వాళ్లేనా.. డిజిటల్ ఇండియాలో ఎందుకు నిలదొక్కులేకపోతున్నారు? – VRM MEDIA

BSNL : బీఎస్ఎన్ఎల్ దుస్థితికి కారణం వాళ్లేనా.. డిజిటల్ ఇండియాలో ఎందుకు నిలదొక్కులేకపోతున్నారు? – VRM MEDIA

by VRM Media
0 comments
BSNL : బీఎస్ఎన్ఎల్ దుస్థితికి కారణం వాళ్లేనా.. డిజిటల్ ఇండియాలో ఎందుకు నిలదొక్కులేకపోతున్నారు?



(ఫోటో: బీఎస్ఎన్ఎల్ లోగో, ప్రతీకాత్మక చిత్రం)ఈవార్తలు, టెక్ న్యూస్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్).. దేశ టెలికం రంగంలో దీని ప్రత్యేక పాత్ర. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ టెలికం సంస్థ ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ కలిగి ఉంది. కానీ, ఆదరణ.. పాపం అనేలా తయారైంది. సింపతీ తప్ప ఇంకేమీ చూపించలేని స్థితికి చేరిందా సంస్థ. ప్రభుత్వ సంస్థను బతికిద్దాం అనుకునే కొద్ది మంది కూడా.. నెట్‌వర్క్, కాల్, మెసేజ్, ఇంటర్నెట్ సమస్యలతో సతమతమవుతున్నారు. అలా నెట్టుకొచ్చేలా ఏదో తయారైంది. కొన్ని ప్రభుత్వాల్లో తప్ప సాధారణ జనం దాదాపు ఈ రంగ టెలికం సంస్థకు దూరమయ్యారు. ప్రైవేట్ కంపెనీల వైపు తిరిగారు తప్ప మళ్లీ బీఎస్ఎన్ఎల్ ముఖం చూడలేదు. అదే సమయంలో ఈ ప్రభావం కోల్పోతుంటే ప్రైవేట్ సంస్థలు వెలుగు చూస్తున్నాయి. వ్యాపారం నుంచి బీఎస్ఎన్ఎల్ దూరం అవుతున్న ప్రారంభంలో వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌టెల్ వినియోగదారులు తక్కువ. అప్పుడే టాటా డొకొమో వన్ పైసా వన్ సెకను లాంటి ఆఫర్లు తెచ్చింది. దీంతో ఆ కంపెనీ సిమ్స్ భారీగా అమ్ముడుపోయాయి. ఆ తర్వాత మిగిలిన కంపెనీలు అదే బాటలోకి వెళ్లాయి. ఒక్క బీఎస్ఎన్ఎల్ తప్ప. దీంతో వినియోగదారులు త్వరగా మారిపోయారు.అయితే, ఇక్కడ సంస్థను బీఎస్ఎన్ఎల్‌కు దూరం చేయటంలో కీలక పాత్ర ఆ ఉద్యోగులదేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. నాడు.. సారూ! సర్వీస్ బాగాలేదని అడిగితే స్పందించిన నాథుడే లేడు. కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే కలవదు. కలిసినా, సమస్య పరిష్కారం దొరకదు. దొరికినా.. ఏ నెలకో, రెండు నెలలకో అన్నట్లు ఉండేది. పైగా, కొత్త సిమ్ కావాలంటే ఆఫీసుల చుట్టు తిరగాల్సిందే. సిమ్ కోసం ఆస్తి పత్రాలను కూడా చూపించాలన్నట్టు డాక్యుమెంట్లు అడిగేవారు. కార్యాలయానికి వెళ్తే.. పట్టించుకోకుండా గంటల తరబడి కూర్చోబెట్టేవారు. జీతం వస్తుంది కదా మాకేంటి

2,805 Views

You may also like

Leave a Comment