[ad_1]
(Photo: ప్రతీకాత్మక చిత్రం)
ఈవార్తలు, టెక్ న్యూస్: ట్విట్టర్‌ను టేకోవర్ చేసి ఎలాన్ మాస్క్ ఈ సామాజిక మాధ్యమంలో పలు కీలక మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా, మరో కీలక అప్డేట్ను ట్విట్టర్ యూజర్ల కోసం తీసుకొచ్చారు. ట్విట్టర్లో ఏకంగా 60 నిమిషాల వీడియోను అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే, ఇక్కడే ఒక తిరకాసు పెట్టింది. ఈ అవకాశం కేవలం బ్లూ టిక్ ఉన్న యూజర్లకు మాత్రమేనని స్పష్టం చేసింది. అవి కూడా 1080 రిజోల్యుషన్తో వీడియోలను అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఆ వీడియో 2జీబీకి మించకూడదు. అయితే, ఈ ఫీచర్‌కు ఆండ్రాయిడ్, యాపిల్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైతే కేవలం డెస్క్‌టాప్ యూజర్లకే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు.
ఇంతకుముందు యూజర్లు 10 నిమిషాల వీడియోను అప్లోడ్ చేసే అవకాశం ఉండేది. అది కూడా 512 ఎంబీ సైజుగా ఉండేది. ప్రస్తుతం దాన్ని పెంచుతూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. ఇంకా.. వీడియో క్వాలిటీని కూడా మార్చుకునే సదుపాయాన్ని వినియోగదారులకు కల్పించింది. ఇదిలా ఉండగా, బ్లూ టిక్ కోసం భారత్‌లో యాపిల్ యూజర్ల నుంచి ట్విట్టర్ నెలకు రూ.910, వెబ్, ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు రూ.660 వసూలు చేస్తోంది. ఈ సబ్స్రిప్షన్ వల్ల బ్లూ టిక్, ట్వీట్ ఎడిట్ వంటి కొత్త ఫీచర్లు వాడుకోవచ్చు.
32 బంతుల్లోనే సెంచరీ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird