
||evarthalu||ఈవార్తలు, టెక్న్యూస్ : Amazon Alexa | మీ ఇంట్లో అమెజాన్ అలెక్సా ఉందా? హే అలెక్సా అని ప్లే సాంగ్స్ అనగానే మంచి మంచి పాటలు పాడుతోందని సంబరపడుతున్నారా? ఏ విషయం అడిగితే ఆ విషయం టక్కున చెప్పేస్తోందని మురిసిపోతున్నారా? అయితే.. ఒక్క నిమిషం. అలెక్సా దొంగ చాటుగా మీ మాటలు వింటోందట. దాని ముందు మీరే మాట్లాడుకున్నా, అది రికార్డు చేస్తోందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషులు ఎవరూ లేరు కదా.. మనం ఏం మాట్లాడుకున్నా ఎవరికీ వినిపించదు కదా అని అలెక్సా ముందు మాట్లాడారో.. అంతే సంగతులు. అలెక్సా రికార్డు చేస్తున్న ఆ డాటాను అమెజాన్ ఉద్యోగుల దొంగ చాటుగా వింటున్నారట.
అందుకే.. అలెక్సాను బెడ్రూం, రహస్య సంభాషణలు జరిపే చోట ఉంచడం ఎంత మాత్రం సేఫ్ కాదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అన్ని వరకు హాల్, కిచెన్ వంటి ఓపెన్ స్పేస్‌లోనే ఉంచాలని స్పష్టం చేయబడింది. ఈ వ్యవహారంపై అమెజాన్ కంపెనీకి వివరణ కోరగా.. అలెక్సా మాటలు వింటున్నది నిజమేనని అంగీకరించింది. అయితే, రిసెర్చ్‌లో భాగంగానే తాము ఈ పని చేస్తున్నామని వివరించింది. అమెజాన్ కంపెనీలో ప్రతీ ఒక్కరు రోజుకు 1000 దాకా రికార్డు సంభాషణలు వింటున్నారని. ఆ సంభాషణలు వినే అధికారాన్ని కంపెనీలోని కొంతమంది ఉద్యోగులకు మాత్రమే ఇచ్చినట్టు స్పష్టం చేసింది. వినియోగదారులు కావాలనుకొంటే రికార్డును ఆఫ్ చేసుకొని ఉంచుకో బటన్‌ను సూచిస్తుంది.
అమెజాన్ అలెక్సాలో రికార్డు బటన్‌ను ఇలా ఆఫ్ చేయండి..
– ఫోన్‌లో అలెక్సా యాప్ ఓపెన్ చేయాలి
– సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి
– ప్రైవసీ అన్న ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
– మేనేజ్ యువర్ అలెక్సా డేటాను సెలెక్ట్ చేసుకోవాలి
– హౌ లాంగ్ టు సేవ్ రికార్డింగ్స్ ను ఎంచుకొని డోంట్ సేవ్ రికార్డింగ్స్ పై క్లిక్ చేయాలి
– కన్ఫార్మ్ నొక్కాలి
– కిందికి స్క్రోల్ చేసి ఇంప్రూవ్ అలెక్సా బటన్‌ను ఎంచుకొని యూజ్ వాయిస్ రికార్డింగ్‌లను సెలెక్ట్ చేయాలి
– అక్కడ ఆఫ్ చేస్తే మీరేం మాట్లాడిన రికార్డ్ అవ్వవు.
32 బంతుల్లోనే సెంచరీ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్