[ad_1]
,
||తెలంగాణ హైకోర్టు ఫోటో: twitter||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తప్పు చేసింది ఒకడు.. కానీ శిక్ష వేసింది మరొకరికి. ఇది అమాయకులను బలి చేయడం అనాదిగా వస్తున్న తీరు. అలాంటి ఘటనే పదో తరగతి లీకేజీ వ్యవహారంలో జరిగింది. వాడెవడో గోడ దూకి స్కూల్లోకి వస్తుంటే భద్రతా సిబ్బంది తప్పు.. వచ్చి విద్యార్థిని బెదిరిస్తుంటే పట్టించుకోకుండా వ్యవహరించిన ఇన్విజిలేటర్ తప్పు.. పరీక్ష కేంద్రం ఇన్చార్జి చేసింది తప్పు.. ఏకంగా ఐదేళ్ల పాటు డిబార్ చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి ఆదేశం కచ్చితంగా ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు. అయితే, ఎట్టకేలకు విద్యార్థికి న్యాయమే జరిగింది. వివరాల్లోకెళితే.. కమలాపూర్ జడ్పీ బాలుర పాఠశాల నుంచి హిందీ పేపర్ లీక్ ఘటనలో.. విద్యార్థి హరీశ్‌ను ఐదేళ్ల పాటు డిబార్ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు.
గురువారం రాయ పరీక్షకు వచ్చిన విద్యార్థిని.. హన్మకొండ హీవో పిలిచి.. నీ ప్రశ్నపత్రం వల్ల ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని తన దురుసుతనం ప్రదర్శించారు. పరీక్షకు అనుమతించేది లేదంటూ బయటికి పంపించేశారు. హాల్ టికెట్ తీసుకొని ఓ పేపర్‌పై సంతకం కూడా తీసుకున్నారని ఆ విద్యార్థి తెలిపాడు. అయితే, తనకు న్యాయం జరుగుతుందని నమ్మిన ఆ విద్యార్థి హైకోర్టు మెట్లు ఎక్కాడు. హరీష్ తండ్రి హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు.
గోడ దూకి పరీక్షకి వచ్చిన నిందితుడు శివ కృష్ణ.. పరీక్ష రాస్తున్న హరీశ్‌ను బెదిరించి ప్రశ్నపత్రం లాక్కున్నాడని అందులో చేర్చాడు. భయపడి ప్రశ్నపత్రం ఇచ్చాడే తప్ప, తన తప్పు లేదని వివరించాడు. వాదనలు విన్న కోర్టు.. సోమవారం నుంచి హరీశ్ పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి ఇవ్వబడిన విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. గురువారం నాటి పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి ఎట్టకేలకు.. కోర్టులో సోమవారం నుంచి పరీక్షలకు హాజరు కానున్నాడు.
వెంకటేశ్ ప్రసాద్‌కు హైకోర్టు షాక్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird