Home వార్తలు డూగీ V మాక్స్ | ఛార్జింగ్ పెట్టకుండా నెల రోజులు పని చేసే ఫోన్.. బ్యాటరీ కెపాసిటీ తెలిస్తే షాకే – VRM MEDIA

డూగీ V మాక్స్ | ఛార్జింగ్ పెట్టకుండా నెల రోజులు పని చేసే ఫోన్.. బ్యాటరీ కెపాసిటీ తెలిస్తే షాకే – VRM MEDIA

by VRM Media
0 comments
డూగీ V మాక్స్ | ఛార్జింగ్ పెట్టకుండా నెల రోజులు పని చేసే ఫోన్.. బ్యాటరీ కెపాసిటీ తెలిస్తే షాకే



||డూగీ వీ మ్యాక్స్ ఫోటో: Twitter||స్మార్ట్ ఫోన్ యుగం మనది. మనం వాడే ఫోన్‌కు చార్జింగ్ సమస్య కామన్. ఛార్జింగ్ సమస్య లేకుండా గంటలు గంటలు ఫోన్ వాడే అవకాశం ఉంటే బాగుండు.. అని ఆలోచించిన సందర్భాలు ఎన్నో. ఆ అవకాశం లేకే.. చార్జర్లతో, పవర్ బ్యాంకులను మోసుకెళ్తుంటాం. అయితే, ఆ సమస్యకు చెక్ పెట్టేలా డూగీ అనే సెల్‌ఫోన్ కంపెనీ వినత్న ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ ఎంతో తెలుసా.. ఏకంగా 22,000 ఎంఏహెచ్. చైనాకు చెందిన ఈ సెల్‌ఫోన్ కంపెనీ.. మూడు నెలల కిందటే మార్కెట్‌లోకి తెచ్చినా, పెద్దగా మార్కెట్ సాధించలేకపోయింది. డూగీ వీ మ్యాక్స్ 5జీ మాడల్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌లో కెమెరాలు 108 ఎంపీ+20 ఎంపీ లెన్స్‌లు కలిగినవి.అయితే, ఫోన్ బరువు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజల్లో ఆదరణ సాధించలేకపోయిన ఈ ఫోన్.. రివర్స్ చార్జింగ్ కెపాసిటీ కూడా కలిగి ఉంది. అంటే.. వేరే ఫోన్లకు చార్జింగ్‌ను ఈ ఫోన్ నుంచి పెట్టొచ్చు. 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ దీని సొంతం. అన్నట్టు ఈ ఫోన్ ధరెంతో తెలుసా.. అమెజాన్‌లో ప్రస్తుతం రూ.51,500కు దొరుకుతోంది.డూగీ వీ మ్యాక్స్ ఫీచర్లుఆండ్రాయిడ్ – ఓఎస్,ర్యామ్ – 12 జీబీ, కనెక్టివిటీ – 5జీఫ్రంట్ కెమెరా – 32రేర్ కెమెరా – 108+16+20 నైట్ విజన్‌బ్యాంటీ-22002000 వాట్స్‌ఫోన్ స్టాండ్ బై – 720 గంటలు (30 రోజులు)

2,809 Views

You may also like

Leave a Comment