
ఈవార్తలు, ఇటీవల గుర్తు: చిన్నపెద్ద అన్న తేడా లేకుండా ఎంతోమంది ప్రాణాలు విడిచారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలతో అసువులుబాసారు. అయితే, ఈ మరణాలకు, వ్యాక్సిన్‌కు సంబంధం లేదని వైద్య నిపుణులు వాదిస్తూ వచ్చారు. అయితే, కోవిషీల్డ్ వాక్సిన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దానిని తయారు చేసిన కంపెనీ ఆస్ట్రాజెనెకా చెప్పడం సంచలనం రేపడంతో ఒక్కసారిగా యావత్తు ప్రపంచం ఉలిక్కిపడింది. ‘కొవిషీల్డ్‌తో ఆరోగ్యసమస్యలు తలెత్తాయి నిజమే.. చాలా అరుదైన కేసుల్లోనే రక్తం గడ్డ కట్టడం, ప్లేట్‌లెట్ల కౌంట్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చాయి’ అని ఆస్ట్రాజెనెకా షాక్ ఇచ్చింది.
అయితే, ఈ సమయంలో ఆస్ట్రాజెనెకా మరో నిర్ణయం తీసుకుంది. సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్‌లను వెనక్కి తీసుకుంటున్నది. ఈ మేరకు చర్యలు చేపట్టారు కూడా. వైరస్ క్యాన్సర్ ప్రభావం తగ్గిపోవటం, మిగులు డోసులు ఉండటంతోనే వ్యాక్సిన్‌లను వెనక్కి రప్పించుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రభావం. ఈ వ్యాక్సిన్ ఇక నుంచి వినియోగానికి అనుమతి లేదని యురోపియన్ మెడిసిన్ ఏజెన్సీ ఆ సంస్థకు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఆస్ట్రాజెనెకా.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను భారత్‌లో సీరం ఇన్‌స్వార్డ్ తయారు చేసింది. కోవిషీల్డ్ పేరుతో ఇక్కడ, వాక్స్‌జెర్వియా పేరుతో యూరప్‌లో ఆస్ట్రాజెనెకా విక్రయాలు జరిగాయి. అయితే, ఈ వ్యాక్సిన్‌లతో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రకటించారు.. కొన్నిరోజులకే వ్యాక్సిన్‌లను రిటర్న్ తీసుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
32 బంతుల్లోనే సెంచరీ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్