
న్యూయార్క్ : సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఐఫోన్ సంస్థలకు యాపిల్ కంపెనీ కీలక జాగ్రత్తలు సూచించింది. కంపెనీ అందించే సెక్యూరిటీ అప్‌డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలని.
యాపిల్ వినియోగదారులకు జాగ్రత్తలు ఇవీ..
1. ఫ్రాడ్ ఈమెయిల్స్‌ను గుర్తించేందుకు ఏ మెయిల్ ఐడీ నుంచి మెయిల్ వచ్చిందనేది జాగ్రత్తగా పరీక్షించాలి.
2. ఎలాంటి పాపప్ యాడ్స్‌పై క్లిక్ చేయొద్దు. ముఖ్యంగా మీ ఫోన్‌లో సెక్యూరిటీ సమస్య ఉందంటూ వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు.
3. యాపిల్ సపోర్ట్ ఒరిజినలా, కాదా అన్నది చూసుకోవాలి. సందేశాలపై అప్రమత్తంగా ఉండాలి.
4. ఉచిత బహుమతులు వచ్చాయంటూ వచ్చే ప్రకటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మి మోసపోవద్దు.
5. అపరిచితుల నుంచి వచ్చే క్యాలెండర్ ఇన్ వైట్లను తిరస్కరించాలి. తెలియని వెబ్‌సైట్లలో పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ కోడ్‌లను ఎంటర్ చేయవద్దు.
6. యాపిల్ ఐడీకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలి. దాంతో మీ ఫోన్‌కు వ్యక్తిగత భద్రత ఉంటుంది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అప్‌డేట్ చేసుకోవాలి.
32 బంతుల్లోనే సెంచరీ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్