[ad_1]
47 ఏళ్ల వయసులో బట్ట తల మొత్తం మటుమాయమై.. తిరిగి ఒత్తైన జట్టును పొంది సంచలనం సృష్టించాడు టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్. కేవలం ఏడాది కాలంలోనే జుట్టును పొందానని వెల్లడించాడు. తిరిగి జుట్టును పొందటానికి తాను ఏమేం చేశానన్నది పూర్తి వివరాలతో వివరించాడు. ఈ మేరకు తన ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. న్యూట్రిషన్, లైట్ థెరపీతో తాను జుట్టును తిరిగి పొందానని చెప్పుకొచ్చాడు. '30 ఏళ్లు దాటాక జుట్టు ఊడిపోవటాన్ని నియంత్రించడం చాలా కష్టం. ముఖ్యంగా జన్యుపరంగా వచ్చే వారికి బట్ట తల కామన్. నేను 20 ఏళ్ల వయసులోనే జుట్టు ఊడిపోవడంతో ఆందోళన చెందా. కానీ.. ఇప్పుడు నాకు 47 ఏళ్లు. తిరిగి జుట్టు వచ్చేసింది. 70 శాతం తెల్ల వెంట్రుకలు కూడా మాయం అయ్యాయి. దానికోసం నేను జన్యు సమస్యల పరిష్కారాన్ని వెతికాను. తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకున్నా. రెడ్ లైట్ క్యాప్ ధరించా' అని బ్రయాన్ చెప్పాడు.
జన్యులోపాన్ని సవరించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు, మెలటోనిన్, కెఫిన్, విటమిన్3 కోసం జాగ్రత్తలు తీసుకున్నట్లు, డీ విటమిన్లు, న్యూట్రిషన్లు, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ వంటి ప్రొటీన్లు తీసుకున్నట్లు తెలిపారు. రివర్స్ హెయిర్ లాస్ కోసం.. మైనోక్సిడిల్ 7 శాతం, సిట్రిజిన్ హెచ్‌సీఐ 1 శాతం, లాటనోప్రోస్ట్ 0.004 శాతం, డ్యూటాస్టెరాయిడ్ 0.25 శాతం, మెలటోనిన్ 0.1 శాతం, కెఫిన్ 0.2 శాతం, విటమిన్ ట్రెనోయిన్ 0.0125 శాతం, ఈ ఎల్ 0125%, విటమిన్ ఐయూ/ఎంఎల్ తీసుకున్నట్టు వివరించాడు.
ఇక.. ప్రతి రోజు రెడ్ లైట్ క్యాప్ ధరించడం వల్ల హెయిర్ గ్రోత్‌లో 39 శాతం పెరుగుదల వేగం కనిపించిందని బ్రయాన్ చెప్పాడు. అయితే.. తన జుట్టును తిరిగి తెప్పించుకునేందుకు బ్రయాన్ ఏడాది కాలంలోనే ఏకంగా 2 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు. మెడికల్ డయాగ్నస్టిక్స్, చికిత్స, ఆహారం, నిద్ర, వ్యాయామం వంటి వాటికి భారీగానే ఖర్చు చేశాడు. ఇదే సమయంలో తన జీవ సంబంధ వయసు కూడా రివర్స్ అయినట్టు వెల్లడించాడు.
రో-కో తుక్కుతుక్కు..! రోహిత్, భారీ ఆట....
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird