Home వార్తలు మీ స్మార్ట్ ఫోన్ వేగాన్ని పెంచాలంటే ఇలా చేయండి.. సెట్టింగ్స్ మార్చుకోవడంతోనే సమస్యకు చెక్ – VRM MEDIA

మీ స్మార్ట్ ఫోన్ వేగాన్ని పెంచాలంటే ఇలా చేయండి.. సెట్టింగ్స్ మార్చుకోవడంతోనే సమస్యకు చెక్ – VRM MEDIA

by VRM Media
0 comments
మీ స్మార్ట్ ఫోన్ వేగాన్ని పెంచాలంటే ఇలా చేయండి.. సెట్టింగ్స్ మార్చుకోవడంతోనే సమస్యకు చెక్


స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య ఫోన్ వేగంగా పనిచేయకపోవడం. ఒక్కోసారి ఫోన్ హ్యాంగ్ కూడా అవుతుంది. దీనివల్ల ఫోను వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫోన్ స్లో అయినప్పుడు వినియోగదారుని చిరాకు పెడుతుంది. అయితే చిన్నపాటి టెక్నిక్స్ పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ చెప్పాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఎదురైనప్పుడల్లా చాలామంది ఫోన్ మార్చేయాలని భావిస్తున్నారు. అయితే ఫోన్ మార్చాల్సిన అవసరం లేకుండా చిన్నపాటి మార్పులను ఫోన్‌లో చేయడం ద్వారా పనితీరు మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంది. ఈ మార్పులతో ఫోన్ కొత్త ఫోన్‌లు పనిచేయాలంటే సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ ను అప్‌డేట్ చేయాలి. లేటెస్ట్ OS తో పనిచేసే ఫోన్లు వేగంగా పని చేస్తాయి. వీటికి సైబర్ అటాక్స్ నుంచి ఫుల్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. మొబైల్ సెక్యూరిటీని పెంచుకోవడమే కాకుండా సరికొత్త ఫీచర్లు అందుకునే వెసులుబాటు ఉంటుంది. స్మార్ట్ ఫోన్ వాడుతున్న కొద్ది బ్యాటరీ వీక్ అవుతుంది. దీనివల్ల కూడా ఫోన్ స్లో అవుతుంది. నెలకు ఒకసారి ఫోన్ ను ఫుల్ గా ఛార్జ్ చేసి కంప్లీట్ గా డిశ్చార్జ్ చేయడం చాలా అవసరం.

ఇలా చేయడం ద్వారా బ్యాటరీ మరింత కాలం పని చేస్తుంది. ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయాలి. అప్పుడు ఎక్కువసేపు పని చేస్తుంది. ఈ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా ఫోన్‌ను ముఖ్యమైన పనులకు ఉపయోగించుకోవచ్చు. కొన్నిసార్లు ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని యాప్స్ రన్ అవుతుంటాయి. అవి యూజర్లకు అనవసరమైనవి అయినా ర్యామ్ లో ఉండి మెమరీని వాడుకుంటాయి. దీని వలన బ్యాటరీ బ్యాకప్ తగ్గుతుంది. అందుకే వాడని యాప్స్ ను తీసేయాలి. బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ రన్ కాకుండా సెట్టింగ్స్ లో కంట్రోల్ చేయాలి. స్మార్ట్ ఫోన్ లో అనవసరమైన ఫైల్స్ ఎక్కువగా ఉంటాయి. అది చాలా మంది గుర్తించారు. దీని వల్ల కూడా ఫోన్ నెమ్మదించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాచ్ డేటాను క్లియర్ చేయాలి. వాడని ఫైల్స్ రిమూవ్ చేయాలి. ఫైల్స్ బై గూగుల్ లాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసి లార్జ్ ఫైల్స్ లేదా డూప్లికెట్ ఫైల్స్ డిలీట్ చేయవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ ద్వారా ఫైల్ షేప్ గా బ్యాక్అప్ చేసుకోవచ్చు. అప్పుడు ఫోన్ లో స్టోరేజ్ స్పేస్ పెరుగుతుంది. పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫోన్ పనితీరును పెంచుకోవడానికి చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అటువంటి కొన్ని యాప్‌లను వినియోగించుకోవడం ద్వారా మెరుగైన పనితీరును ఫోన్ నుంచి ఆశించవచ్చు. ఫోన్ లో బ్యాటరీ, ఇతర పార్ట్స్ లైఫ్ అయిపోతే దాని పెర్ఫార్మన్స్ నెమ్మదించే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఆయా పార్ట్స్ మార్చుకుంటే డివైస్ ఎప్పటిలాగే పనిచేస్తుంది. బ్యాటరీ లేదా స్క్రీన్ ను అఫీషియల్ సర్వీస్ సెంటర్ లోనే మార్చుకోవాలి. అనాథరైజ్డ్ పర్సన్స్ ఫోన్ ను రిపేర్ కోసం ఓపెన్ చేస్తే వారంటీ పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది.

రోహిట్’.. 352 సిక్సులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,805 Views

You may also like

Leave a Comment