
ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఇటువంటివారు స్వామివారి కోసం నిరంతరం ఆసక్తి చూపిస్తారు. స్వామివారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లను టిటిడి అధికారులు చేస్తున్నారు. అందులో భాగంగానే చాట్ జిపిటి తరహాలో వాయిస్ ఆధారిత టీటీడీ చాట్ బాట్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు టిటిడి ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. దీని ద్వారా ఎటువంటి భక్తులకు అయినా సులభంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనిని కొద్ది రోజుల్లోనే భక్తులకు అందజేసేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల తిరుమలలోని సమగ్ర సమాచారం భక్తులు కోరుకున్నప్పుడు అత్యంత వేగంగా ఉండే అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలు..
టీటీడీ అధికారులు విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించారు. తిరుమలలో అనేక మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు. అన్నప్రసాదాలు, లడ్డూలు మరింత నాణ్యంగా అందించాలని టిటిడి అధికారులు చెబుతున్నారు. ఎండిడిబి విరాళంగా ఇచ్చిన రూ.70 లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతంగా ఏర్పాటు చేసుకున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో పేర్కొంది. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయ మాడవీధులు అభివృద్ధి, చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో యువతలో భక్తి భావన పెంచేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. విజన్ 2047 కు అనుగుణంగా ప్రత్యేక లక్ష్యాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేసుకున్నారు. తిరుమల నడక ఆధునీకరణ, బహుళ స్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింకు రోడ్ల నిర్మాణం, సబ్వే నిర్మాణం, బస్టాండ్ల పునర్నిర్మాణం, భక్తుల వసతి కోసం అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంపు ఏర్పాటు, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా తిరుమలలో భావనల రూపకల్పన, టీటీడీలో ఉన్న 31 మంది హిందూ యాత్రలకు సంబంధించిన శాఖలకు పంపడం, లేదా వీఆర్‌ఎస్ టీ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తిరుమలలో అక్రమాస్తుల కోసం భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న దుకాణదారులు, హ్యాకర్లు, లైసెన్సుదారులు, అనధికార తట్టలపై కఠిన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించింది. ఆకాశగంగ, పాప వినాశనం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు చేపట్టిన హెచ్‌డిపి కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించి మరింత మెరుగై నిర్వహించేందుకు సిద్ధమవుతోంది టీటీడీ. తిరుమలలో ప్రైవేట్ క్యాంటీన్‌లో ధరల నియంత్రణ, పేరుపొందిన సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగింత, నాణ్యమైన భోజనం అందించే చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం కల్పించడంతోపాటు వాసతి అందించేలా చర్యలు చేపడతారు. దర్శనం, వసతి, ప్రసాదాల దళారీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని టిటిడి బోర్డు నిర్ణయించింది.
అశ్లీల కంటెంట్.. ఆధార్ లింక్! సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్