Home అంతర్జాతీయ అమెరికాను అల్లాడిస్తున్న కార్చిచ్చు.. ఇప్పటి వరకు 24 మంది మృతి -VRM MEDIA

అమెరికాను అల్లాడిస్తున్న కార్చిచ్చు.. ఇప్పటి వరకు 24 మంది మృతి -VRM MEDIA

by VRM Media
0 comments
అమెరికాను అల్లాడిస్తున్న కార్చిచ్చు.. ఇప్పటి వరకు 24 మంది మృతి


అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికీ కార్చిచ్చు శాంతించ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతం పై వరుసగా ఆరో రోజు కూడా కార్చిచ్చు ప్రతాపం చూపించింది. కార్చిచ్చు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 24కి చేరింది. మరో పాతికమంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు. తీవ్రమైన గాలులు వీస్తుండడంతో మంటలు ఒకచోట నుంచి మరోచోటకు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అమెరికా చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీతంగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అభివర్ణించారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 24 మంది బలయ్యారు. వీరిలో పాలిషేడ్స్ లో 8 మంది, ఎటోన్లో 16 మంది మరణించారు. చనిపోయిన వాళ్ళలో కిడ్డీ కాపర్స్ ఫేమ్ నటుడు రోరి సైక్స్ కూడా ఉన్నాడు. కార్చిచ్చుతో ఆర్థికంగా వాటి నష్టం 150 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ళ విస్తీర్ణం దగ్ధమైందని అంచనా వేస్తున్నారు. 12 వేల నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మరింతగా ఈ నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పి వేయడానికి స్థానిక అగ్నిమాపకదళంతో పాటు కెనడా, మెక్షికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. మొత్తంగా 14,000 మంది సిబ్బంది, 1354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్ క్రాఫ్ట్ లు ఇందులో పాలుపంచుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే కార్చిచ్చు నివాసం కారణంగా లాస్ ఏంజెల్స్ కౌంటిలో ఒక పాయింట్ ఐదు లక్షల మంది ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఇల్లు కోల్పోయింది బిరాల్లో తలదాచుకుంటున్న వారికి నిత్యవసరాలు, దుస్తులు నగదు దాతలు భారీగా వస్తున్నాయి. ఇది ఎలా ఉంటే మంటలను ఆర్పేందుకు నీటి కొరత అక్కడ ప్రధాన సమస్యగా మారినట్లుగా ఉంది. హాలీవుడ్ స్టార్ల నిర్వాకం వల్లే లాస్ ఏంజెల్స్ లో ఈ దుస్థితి తలెత్తిందన్న విమర్శలు వస్తున్నాయి. నీటిని ఇస్తారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో మంటలను చల్లార్చడానికి నీటి కొరత ఎదురవుతోందని చెబుతున్నారు. కొంతమంది స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకుంటున్నారని అక్కడ ప్రముఖ సంస్థ వార్తను ప్రచురించింది. ఈ కార్చిచ్చు వల్ల అమెరికాలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంతోమంది ఆస్తులను కోల్పోవడంతో పాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నష్ట నివారణ చర్యలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఫస్ట్ పిక్ పాలిషెడ్స్ లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ శక్తినిచ్చింది. 20 శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెషర్ చాలక పోవడంతో కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తూ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,801 Views

You may also like

Leave a Comment