Home అంతర్జాతీయ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్.. బైడాన్ నిర్ణయాలు రద్దుకు మొగ్గు -VRM MEDIA

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్.. బైడాన్ నిర్ణయాలు రద్దుకు మొగ్గు -VRM MEDIA

by VRM Media
0 comments
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్.. బైడాన్ నిర్ణయాలు రద్దుకు మొగ్గు


అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటలకు ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ నేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు, మహారధుల సమక్షంలో క్యాపిటల్ బిల్డింగ్ లో జరిగిన వేడుకల్లో రిపబ్లికన్ నేత ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 78 ఏళ్ల డోనాల్డ్ ట్రంప్ తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం చేశారు. 1861లో అబ్రహం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్ ను చేతిలో పట్టుకుని ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. మొదట ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ లో తీవ్రమైన చలిగాలు వీస్తుండడంతో క్యాపిటల్ బిల్డింగ్ లాన్ లో జరగాల్సిన వేడుక లోపల హాల్లోకి మార్చబడింది. బయట సాంస్కృతిక కార్యక్రమాలు, మిలిటరీ పరేడ్ యధావిధిగా కొనసాగాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా, అంతకుముందు అభిమానులతో ర్యాలీలో ట్రంప్ ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఈ క్షణం నుంచి అమెరికా స్వర్ణయోగం ప్రారంభమైందని ప్రకటన. మళ్లీ అమెరికా గొప్ప దేశం అవుతుందని భరోసా ఇచ్చారు. ప్రపంచం మొత్తం అమెరికాను చూసి కుళ్ళుకుంటుందని మద్దతుదారుల హర్షద్వానాల మధ్య ఉండవచ్చు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. బుల్లెట్ తన చెవిని చీల్చుకుంటూ వెళ్లిందని, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా గొప్ప కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు తనను రక్షించాడనే ట్రంప్ ఈ సందర్భంగా జరిగింది. అధ్యక్షుడిగా భారీ నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు. వలసల పై భారీ ఎత్తున నియంత్రణలు పెడతామని, వలసదారులపై ఉక్కు పాదం మోపుతామని. అక్రమంగా ఉంటున్న వెంటనే లక్షలమంది నేరగాళ్లను దేశంలో వెళ్లగొడతామన్నారు. చమురు తవ్వకాల మీద బడన్ తీసుకున్న నిర్ణయాలను తిరగదోడతామని ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేస్తామని సాయుధ బలగాలను మహోస్తామని స్పష్టం చేశారు సరిహద్దు దాటి వచ్చి ఆశ్రయం కోరింది ఇకనుంచి కోర్టు విచారణ తేదీ వచ్చేవరకు సరిహద్దుల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వ్యక్తులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ప్రస్తుతం మేటిక్ పౌరసత్వం ఇస్తున్నారని, దాన్ని ఎత్తేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం సూర్యుడు అస్తమించే సమయానికి అమెరికాపై జరుగుతున్న దాడి ఆగిపోతుందని. నాలుగేళ్ల అమెరికా పతనానికి తెరపడిందని, తక్షణమే క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసుల్లో దోషులు అభియోగాలు ఎదుర్కొంటున్న 1500 మందికిపైగా బాధితులకు ఉపశమనం కల్పిస్తామని పునరుద్ఘాటించారు.

ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు డోనాల్డ్ ట్రంప్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు వాషింగ్టన్ డిసి లో ఆదివారం నిర్వహించిన ఈ ర్యాలీలో ట్రంప్ తన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ షర్టులు ధరించిన వేలమంది ట్రంప్ అభిమానులు దేశం నలుమూలల నుంచి వాషింగ్టన్ కు వచ్చి వర్షం, మంచును లెక్కించకుండా ర్యాలీలో ఉన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తాను ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా వ్యవహరించిన వెంటనే అత్యంత వేగంగా నిర్ణయం తీసుకుంటానని అమెరికా బాధ్యత ప్రతి సమస్యను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష పదవి కాలం గంటల్లో ముగుస్తుందని జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రంప్ ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ పౌచి, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష ఆదేశాలు జారీ చేశారు. వీరితోపాటు క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకు ఉపశమనం కలిగించారు.

ఇదిలా ఉంటే ఉదయమే వైట్ హౌస్ కు వచ్చిన ట్రంప్ కు దిగిపోతున్న అధ్యక్షుడు బైడన్ సాదర స్వాగతం పలికి తేనేటి విందు ఇచ్చారు. తెలుగింటి అల్లుడు, కొత్త ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కు దిగిపోతున్న ఉపాధ్యక్షురాలు కమలహరి స్వాగతం పలికారు. జెడి వాన్స్ వెంట ఆయన సతీమణి ఉష చిలుకూరి కూడా ఉన్నారు. ట్రంప్ వెంట ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఉన్నారు. ట్రంప్ భార్య బుగ్గపై ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయగా ఆమె హాట్ అడ్డం రావడంతో ఆగిపోయారు. శ్వేత సౌదంలో విందు అనంతరం ట్రంప్ బైడాన్ తో కలిసి ఒకే వాహనంలో ప్రమాణ స్వీకారం మహోత్సవానికి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార ప్రధాన మోడీ ప్రత్యేక దూతగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ సంస్థ. ట్రంప్ ను అభినందిస్తూ ప్రధాని రాసిన లేఖను వెంట తీసుకెళ్లారు. మరోవైపు ప్రధాని మోదీ తన ప్రియమిత్రుడు ట్రంప్ నాకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, రెండు దేశాలకు మేలు చేయడానికి మరోసారి మీతో సన్నిహితంగా కలిసి పని చేయండి అంటూ ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. ట్రంప్ ప్రమాణస్వీకార వేడుకకు ఇతర మాజీ అధ్యక్షులతోపాటు బరాక్ ఒబామా హాజరైనప్పటికీ మిచెల్లీ ఒబామా రాలేదు. ట్రంప్ క్యాబినెట్‌లో అగ్రగామిగా చోటు దక్కించుకున్న నేతలతోపాటు వివేక రామస్వామి, టెస్లా ఎలాన్ మాస్క్, మార్క్ జుకర్ బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ ఉన్నారు.

ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,809 Views

You may also like

Leave a Comment