Home అంతర్జాతీయ భారత వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. మళ్లీ సంకెళ్లతో వెనక్కి.! -VRM MEDIA

భారత వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. మళ్లీ సంకెళ్లతో వెనక్కి.! -VRM MEDIA

by VRM Media
0 comments
భారత వలసదారులపై అమెరికా అమెరికా ఉక్కుపాదం .. మళ్లీ సంకెళ్లతో వెనక్కి.!


అమెరికాలో ఉద్యోగాలు, ఉన్నత చదువులు చదివేందుకు సరైన పత్రాలు లేకుండా వెళ్లిన భారతీయులపై అమెరికా ఉక్కు పాదం మోపుతోంది. ఇప్పటికే అటువంటి వారిని గుర్తించి యుద్ధ విమానాల్లో సంకెళ్లు వేసి మరి భారత్ కు పంపిస్తున్న అమెరికా.. తాజాగా మరో యుద్ధ విమానంలో అటువంటి వారిని భారత్ కు పంపించింది. కొద్దిరోజులు కిందట యుద్ధ విమానంలో వచ్చిన భారతీయులకు సంకెళ్లు వేసి మరి పంపించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఈ విషయంలో కాస్త సానుకూలంగా ఉందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అమెరికా విధానంలో ఎటువంటి మార్పు రాకపోవడం లేదు. తాజాగా మరో యుద్ధ విమానంలో 228 మందిని భారత్‌కు పంపిన అమెరికా.. గతంలో మాదిరిగానే సంకెళ్లు వేసి మరి తరలించింది. రెండు విడతల్లో వచ్చిన వీరిని పంజాబ్ లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. తమ చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో బంధించి తీసుకొచ్చారని భారతీయ వలసదారులు వాపోయారు. విమానంలో ప్రయాణ సమయం అంతా ఇలానే ఉంచారని, అమృతసర్‌లో విమానం దిగిన తర్వాతనే సంకెళ్లు, గొలుసులు తొలగించారని. తొలి విడతలో వచ్చిన భారతీయులు కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. మళ్లీ అటువంటి అమెరికా అనుసరించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారతదేశానికి అమెరికా ఇస్తున్న గౌరవం ఇదేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

పెద్ద ఎత్తున గుర్తింపు

అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను గుర్తించే అమెరికా పెద్ద ఎత్తున చేపడుతోంది. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై దేశ బహిష్కరణ చర్యల్లో భాగంగా గుర్తిస్తోంది. తొలి విడతలో 5న భారతకు చెందిన 105 మంది పౌరులను వెనక్కి పంపించారు. రెండో విమానం 116 మందితో శనివారం రాత్రి 11:30 గంటలకు, మూడో విమానం 112 మందితో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అమృత్ సర్ కు వచ్చాయి. రెండో విడత విమానంలో 65 మంది పంజాబ్, 33 మంది హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మూడో విమానంలో హర్యానాకు చెందిన 44 మంది, గుజరాత్ కు చెందిన 33 మంది, పంజాబ్ రాష్ట్రానికి చెందిన 31 మంది ఉన్నారు. రెండో విమానంలో వచ్చిన చిక్కుల్లో ఎవరూ తలపగ చుట్టుకోలేదు. తలపాగా చుట్టుకునేందుకు అమెరికా అధికారులు అనుమతించలేదని సిక్కు వలసదారుల ఆవేదన వ్యక్తం చేశారు. సిఫార్సు శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. చట్టం ప్రకారం అమెరికాకు తీసుకెళ్తామని చెప్పి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ట్రావెల్ ఏజెంట్లను మోసం చేశారు వలసదారులు. డైరెక్ట్ ఫ్లైట్‌లో అమెరికాకు పంపిస్తామని ట్రావెల్ ఏజెంట్ నమ్మించి మోసం చేయడం ద్వారా తాను నష్టపోవాల్సి వచ్చిందని పంజాబ్‌కు చెందిన దల్జిత్ సింగ్ చెప్పాడు. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశతో పొలాలు తాకట్టు పెట్టి కొందరు, పొలాలు పశువులు అందరూ మరికొందరు తల్లిదండ్రులు ఆ సొమ్ముతో అమెరికాకు పంపారు. ఇప్పుడు వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,806 Views

You may also like

Leave a Comment