Home వార్తలుఖమ్మం పోలీస్ కుటుంబాలకు ఉచిత కంటి వైద్య పరిక్షలు :పోలీస్ కమిషనర్

పోలీస్ కుటుంబాలకు ఉచిత కంటి వైద్య పరిక్షలు :పోలీస్ కమిషనర్

by VRM Media
0 comments

ది.05.03.2025
Vrmmedia

పోలీస్ కుటుంబాలకు ఉచిత కంటి వైద్య పరిక్షలు :పోలీస్ కమిషనర్

వాసన్ ఐ కెర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరిక్షల వైద్య శిబిరాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సూచనల మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బుధవారం రెండు వందల మంది పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బందికి ఆరోగ్యవంతమైన కంటి చూపు కోసం ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ కంటి చూపును మెరుగుపరచుకోవడం, అలాగే కంటి చూపు సరిగా లేని వారికి రాయితీలో శస్త్ర చికిత్సలు, కళ్ళజోళ్ళను పంపిణీ చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఈనెల 12 వ తేది వరకు పోలీస్ కళ్యాణ మండపంలో కంటి వైద్య నిపుణులు అందుబాటులో వుంటారని,వివిధ రకాల కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ నర్సయ్య, సుశీల్ సింగ్,డాక్టర్ శివరామ్, రాజేష్, జితేందర్, అప్సర్,సాయిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

                    Vrmmedia 
2,819 Views

You may also like

Leave a Comment