Home వార్తలుఖమ్మం స్త్రీ అంటే అబల కాదు ఆదిశక్తి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

స్త్రీ అంటే అబల కాదు ఆదిశక్తి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

by VRM Media
0 comments

*VRM MEDIA* పురుషులతోపాటు పోటీ పడుతున్న అతిబలు వ్యాపార రంగంలో రాణిస్తున్న మహిళలు స్త్రీ జీవన ప్రమాణాలే..అభివృద్ధికి కొలమానాలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. సక్సెస్ఫుల్ ఉమెన్ శ్రీమతి కూరపాటి మంజుల గారి ఇంటర్వ్యూ… ఖమ్మం పట్టణంలో పెట్రోల్ బంకును సొంతంగా నిర్వహిస్తూ రాజకీయ రంగంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు కూరపాటి మంజుల, మహిళలు ఇంటికే పరిమితం అన్న పదాన్ని సేదిస్తూ ఇంట్లో కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా భార్యగా, తల్లిగా తన ప్రేమ మనల్ని అందిస్తూ ఇంట్లో ఖాళీగా ఉండకుండా వ్యాపార రంగంలో దిగాలని నిర్ణయించి ఖమ్మం బోనకల్ రోడ్డులో ఐఓసీ పెట్రోల్ బంకును గత రెండు దశాబ్దాల నుంచి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూరపాటి వెంకటేశ్వర్లు వనస్థలియ డాక్టర్ కాగా వారికి ఇద్దరు కుమారులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ గా ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడ్డారు అన్ని రంగాల్లో మహిళలు సమానం అన్న ధోరణితో రాజకీయ రంగంలో కూడా ఆమె అడుగు పెట్టారు. 2000 సంవత్సరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆనాడు అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆహ్వానం మేరకు ఖమ్మం పట్టణ మున్సిపల్ చైర్మన్ పదవి కి టిడిపి తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన తర్వాత మహిళా కోటా కింద ఐఓసీ నోటిఫికేషన్ జారీ చేయగా దరఖాస్తు చేయడంతో పెట్రోల్ బంక్ డీలర్ షిప్ లభించింది. భర్త పొరపాటు వెంకటేశ్వరరావు ప్రైవేట్ డాక్టర్ కావడంతో వృత్తిరీత్యా బిజీగా ఉండడంతో బంకుకు సంబంధించిన అన్ని లావాదేవీల స్వీకరణ అన్ని తానే నిర్వహిస్తూ మరో 15 మందికి ఉపాధి కల్పిస్తూ ఖమ్మం డిస్ట్రిక్ట్ పెట్రోలియం డీలర్ సంఘానికి కార్యదర్శిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో ఆ రంగంలో నేటికీ రాణిస్తూనే ఉన్నారు. కుటుంబ బాధ్యతలో ఎటువంటి లోపం లేకుండా తన బాధ్యత నిర్వహిస్తూ వ్యాపార రంగంలో రాజకీయ రంగంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు.

2,852 Views

You may also like

Leave a Comment