Home వార్తలుఖమ్మం పాల్వంచ సొసైటీ మాజీ డైరెక్టర్ చిల్లా వెంకన్న ఆకస్మిక మృతి పట్ల సంతాపం తెలిపిన

పాల్వంచ సొసైటీ మాజీ డైరెక్టర్ చిల్లా వెంకన్న ఆకస్మిక మృతి పట్ల సంతాపం తెలిపిన

by VRM Media
0 comments

పాల్వంచ సొసైటీ మాజీ డైరెక్టర్ చిల్లా వెంకన్న ఆకస్మిక మృతి పట్ల సంతాపం తెలిపిన
రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ మాజీ డైరెక్టర్ చిల్లా వెంకన్న శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. వెంకన్న 2005 – 2012 సంవత్సరం వరకు పాల్వంచ సొసైటీ డైరెక్టర్ గా వున్నారు.

పాల్వంచ మండలం పరిధిలోని మొండికట్ట (సత్యనారాయణపురం) గ్రామంలోని ఆయన భౌతికకాయానికి రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పూలమాల వేసి, నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, సొసైటీ మాజీ డైరెక్టర్ రౌతు రామారావు, ప్రముఖ న్యాయవాది అంబేద్కర్, ప్రభాకర్, సూరయ్య, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

2,841 Views

You may also like

Leave a Comment