Home వార్తలుఖమ్మం మహిళాలోకానికి సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివి— రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

మహిళాలోకానికి సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివి— రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

by VRM Media
0 comments

మహిళాలోకానికి సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివి
రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

మహిళల ఔన్నత్యాన్ని సమాజంలో చాటి చెప్పి, మహిళా లోకానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మమరువలేనివని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, క్రాంతి జ్యోతి, మాతా సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం పాల్వంచ యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కొత్వాల సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా విద్యకు దూరమై, నిరక్షరాసులుగా వున్నా మహిళలకు, బలహీన వర్గాల మహిళలకు అక్షరాభ్యాసం చేయించిన ఘనత ఆమెదేనన్నారు. గ్రామాల్లోని మహిళలకు తానే స్వయంగా అక్కడకు వెళ్లి చదువు చెప్పిన ఘనత పూలేదన్నారు. ఆమె ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమానికి పాల్వంచ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ అధ్యక్షత వహించగా పాల్వంచ మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు SVRK ఆచార్యులు, పైడిపల్లి మనోహర్, కందుకూరి రాము, దారా చిరంజీవి, ఉండేటి శాంతివర్ధన్, ముళ్ళపాటి శ్రీకాంత్, షేక్ షఫి, తదితరులు పాల్గొన్నారు.

2,842 Views

You may also like

Leave a Comment