
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలన్న యువత సంఖ్య దేశంలో అధికంగా ఉంటుంది. ఏటా లక్షలాదిమంది యువకులు అమెరికా వెళ్లి ఉన్నత చదువులు అభ్యసిస్తారు. అయితే గడిచిన కొన్నాళ్లుగా అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికా వెళ్లాలని ఆకాంక్ష యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వందలాది మందిని ఆదేశం యుద్ధ విమానాల్లో భారతదేశానికి పంపుతోంది. అదే సమయంలో అక్కడ పరిస్థితులు కూడా అధ్వానంగా ఉండటంతో అమెరికా వెళ్లాలి అని కలలు కన్నవారు కూడా కొద్ది రోజులు ఆగాలన్న ఆలోచనలోకి వెళుతున్నారు. ఇంజనీరింగ్ చేసిన ఎంతోమంది విద్యార్థులు ఎంఎస్ పేరుతో అభిమానం ఎక్కేందుకు సిద్ధపడేవారు. వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపించేవారు. అయితే ఆ కళ చెదిరిపోతున్న సూచనలు క్రమంగా కనిపిస్తున్నాయి. రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి కారణం. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే హెచ్1బి వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌కు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు 4,79,953 కాగా, గడిచిన ఏడాదితో ఇది 38.6 శాతం తక్కువ. ఈ దరఖాస్తుల్లో భారత నుంచి వచ్చినవి సంఖ్యలో ఉంటాయి. వీటి సంఖ్య తగ్గింది అంటే భారత్ నుంచి తగ్గుదల భారీగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భారత నుంచి ఎక్కువ వీసా అభ్యర్థులు వచ్చే నగరాల్లో హైదరాబాద్ టాప్ త్రీలో ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి లేదు. హెచ్1 బి వీసాల కోసం పోటీ లేదంటున్నాయి పలు సంస్థలు. ఏదోరకంగా అమెరికాకు వెళ్లి నష్టపోవడం కంటే.. కొన్నాళ్లపాటు వేచి ఉండటం ఉత్తమం అన్న ఆలోచనలు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇతర దేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తుండడం కూడా మన విద్యార్థులను ఆలోచించేలా చేస్తున్నాయని