
Vrm Media
మనకు ఉపయోగం పడని వస్తువులు ఇతరుల అవసరాలకు అందించాలి…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*సహాయం చేయాలనుకున్న వారికి మంచి ప్లాట్ ఫాం వాల్ ఆఫ్ కైండ్ నెస్
మీకు అవసరమైనది తీసుకోండి, అవసరం లేనిది వదిలేయండి
*వాల్ ఆఫ్ కైండ్ నెస్ గోడ ర్యాక్ లకు సేవా చేసే అవకాశంగా వాడుకుందాం
*వాల్ ఆఫ్ కైండ్ నెస్ గోడ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
*వాల్ ఆఫ్ కైండ్ నెస్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, మార్చి -20:
మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులు ఇతరులకు ఉపయోగ పడవచ్చని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదురుగా వాల్ ఆఫ్ కైండ్ నెస్ గోడను అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ట్రైన్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డిఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వాల్ ఆఫ్ కైండ్ నెస్ కార్యక్రమం క్రింద జిల్లా ప్రధాన ఆసుపత్రికి ఎదురుగా ఉన్న గోడ వద్ద ప్రజలు తమ ఇంట్లో అవసరం లేని వస్తువులు, పాత సామాన్లు, బట్టలు వదిలితే అవి అవసరం ఉన్నవారు తీసుకొని వెళ్తారని తెలిపారు.
శుభ్రంగా ఉపయోగించదగిన, పాడైపోని దుస్తులు, బూట్లు, పుస్తకాలు, పాత్రలు, ఏదైనా ఇతర వస్తువులను వదిలి వేయాలని అన్నారు. వాల్ ఆఫ్ కైండ్ నెస్ గోడ వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఆహార పదార్థాలు వదిలివేయొద్దని కలెక్టర్ తెలిపారు.
వాల్ ఆఫ్ కైండ్ నెస్ దగ్గర వస్తువులను వాటికి ఏర్పాటు చేసిన సెల్ఫ్ లలో ఉంచాలని, తద్వారా అవసరమైన వారు వాటిని సులభంగా కనుగొనవచ్చు అని అన్నారు. వాల్ ఆఫ్ కైండ్ నెస్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వస్తువులను నేలపై విసిరేయడం, వదిలేయడం వంటివి చేయవద్దని అన్నారు.
దయచేసి మీకు అవసరమైనది తీసుకోండి అని, అవసరం లేనిది వదిలేయండి అనే నినాదంతో వాల్ ఆఫ్ కైండ్ నెస్ పని చేస్తుందని అన్నారు. దయ యొక్క గోడ వద్ద ఉన్న వస్తువులను ఎవరైనా వారి అవసరం మేరకు తీసుకొని వెళ్ళవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ దీక్షా రైనా, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Vrm Media





