
ప్రతి జర్నలిస్టు కుటుంబం హెల్త్ కార్డులు పొందాలి
హెల్త్ కార్డుల జారీ కేంద్రాన్ని ప్రారంభించిన టియుడబ్ల్యూ జే (టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మూడు రోజులపాటు ప్రత్యేక క్యాంపు
ఖమ్మం మార్చి24 : ప్రతి జర్నలిస్టు కుటుంబం తప్పకుండా హెల్త్ కార్డులు తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి.జె.ఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి కోరారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మూడు రోజులపాటు కొనసాగనున్న జర్నలిస్టుల హెల్త్ కార్డు జారీ ప్రక్రియ క్యాంప్ కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ… కంటికి నిద్ర లేకుండా రాత్రింబవళ్లు విధి నిర్వహణలో ఉంటూ, ఊరుకుల పరుకుల జీవితంలో ఉంటున్న జర్నలిస్టులు తప్పకుండా హెల్త్ కార్డు కలిగి ఉండాలని సూచించారు.
ఎవరో వస్తారు.. మరెవరో ఆదుకుంటారో ఆదుకుంటారని వారికోసం ఎదురు చూస్తే ప్రయోజనం ఉండదని, మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఐదు లక్షలు విలువైన వైద్యాన్ని ఉచితంగా ఈ కార్డు ద్వారా పొందవచ్చని, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు తప్పకుండా హెల్త్ కార్డులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మూడు రోజులపాటు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డుల జారీ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సెంటర్ వద్ద ఆధార్ కార్డు నెంబర్, దానికి అనుసంధానం అయి ఉన్న ఫోన్ నెంబర్ ఓటిపి చెప్పి వెంటనే హెల్త్ కార్డులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల సంక్షేమం వారి శ్రేయసే ముఖ్యమని అటువంటి కార్యక్రమాలను తమ టీజెఎఫ్ యూనియన్ నిరంతరం ముందు ఉండి పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీజెఎఫ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టిఎస్ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పల రాంబాబు, కోశాధికారి బిక్కీ గోపి, యూనియన్ నాయకులు అంతోటి శ్రీనివాస్, కె. గోవింద్, ఉల్లోజి రమేష్, రోషి రెడ్డి, ఎస్ డి న్యూస్ యాదగిరి, పిసి డబ్ల్యు నరేష్, జీకే న్యూస్ నరేష్, కంప్యూటర్ టెక్నికల్ ఇంచార్జ్ వెంకట్, అశ్విని తదితరులు పాల్గొన్నారు.
