Home kothagudem సజావుగా ధాన్యం కొనుగోలు జరిగేలా పటిష్ట కార్యాచరణ రూపొందించాలి … జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సజావుగా ధాన్యం కొనుగోలు జరిగేలా పటిష్ట కార్యాచరణ రూపొందించాలి … జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

by VRM Media
0 comments

Vrm media

సజావుగా ధాన్యం కొనుగోలు జరిగేలా పటిష్ట కార్యాచరణ రూపొందించాలి … జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సన్న, దొడ్డు రకం దాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు

*గ్రామాలలోనే తేమ శాతం పరిశీలించి నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా చర్యలు

*కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతుల కల్పన

*సన్న రకం ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు పక్కాగా ధ్రువీకరించాలి

*ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాలను సన్నద్ధం చేయాలి

*ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఖమ్మం, మార్చి -25:

యాసంగి మార్కెటింగ్ సీజన్ లో ఖమ్మం జిల్లాలో సజావుగా ధాన్యం కొనుగోలు జరిగేలా పటిష్ట కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

మంగళవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు ఖమ్మం జిల్లాలో విజయవంతంగా జరిగిందని అభినందించారు. రైతు కోసం పనిచేస్తున్నామనే అంశాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు.

రైతులు పండించిన వరి పంట విస్తీర్ణం, పంట కోతల సమయం, కొనుగోలు కేంద్రాలకు ఎప్పుడు పంటలు తీసుకుని వస్తారనే అంశం వ్యవసాయ శాఖ ప్రణాళిక బద్ధంగా షెడ్యూల్ చేయాలని అన్నారు. సన్న రకం, దొడ్డు రకం దాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వచ్చే ధాన్యం అంచనా ప్రకారం అవసరమైన వెయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్, గన్ని సంచులు మొదలైన మౌళిక వసతులు ఉండేలా చూడాలని అన్నారు.వేయింగ్ యంత్రాలను, తేమ యంత్రాల పని తీరు చెక్ చేసి సర్టిఫై చేయాలని అన్నారు. త్రాగు నీరు, విద్యుత్ సరఫరా, లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

వేసవి దృష్ట్యా త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, చల్లని త్రాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకేట్లు పెట్టుకోవాలని అన్నారు. వడదెబ్బ తగిలితే వారికి ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాటు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన టెంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు.

రైతులు పండించిన సన్న రకం ధాన్యాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులు సర్టిఫై చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలోనే తేమ యంత్రాలు అందుబాటులో పెట్టి, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ముందుగా రైతులకు బస్తాలు ఇవ్వడానికి వీలు లేదని అన్నారు. కొనుగోలు సమయంలో మాత్రమే రైతులకు బస్తాలు ఇవ్వాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో అందుబాటులో ఉన్న బస్తాల వివరాలను ఎప్పటికప్పుడు నోటీసు బోర్డులో అప్ డేట్ చేయాలని అన్నారు.

ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వెంటనే వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేసేలా చూడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలకు నూతన సిమ్ కార్డులను అందించి డేటా ఎంట్రీ సత్వరం జరిగేలా చూడాలని అన్నారు. రైతులకు 48 గంటల వ్యవధిలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నారు.

రైస్ మిల్లులో ఎట్టి పరిస్థితుల్లోనూ తాళ్ళు కట్ చేయడానికి వీలు లేదని, నాణ్యతను కొనుగోలు కేంద్రాల దగ్గరే పరిశీలించి పంపాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద, రైస్ మిల్లుల వద్ద ఎక్కడ హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో రవాణా వాహనాలకు ఇబ్బందులు రాకుండా మందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.

ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాలలో ఇతర రాష్ట్రాల నుంచి సన్న రకం ధాన్యం రాకుండా చూడాలని అన్నారు.

అనంతరం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులందరికీ విజ్ఞప్తి పేరున రబీ వ్యవసాయ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించిన కనీస మద్దతు ధరలు తెలిపే కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో డిఆర్డిఓ సన్యాసయ్య,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా సహకార అధికారి గంగాధర్, ప్రత్యేక అధికారులు, సెంటర్ ఇన్చార్జి లు ఐ.కె.పి., సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Vrm media

Vrm media
2,815 Views

You may also like

Leave a Comment