
“బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి”
ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారి ఆదేశానుసారం,
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, జోహార్ డాక్టర్ జగ్జీవన్ రావు అంటూ నినాదాలు చేస్తూ, ఘనంగా నివాళులర్పించారు.
భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన జగ్జీవన్ రామ్ అనంతరం అనేక రాజకీయ పదవులను చేపట్టి, పాఠశాల దశ నుండి ఉన్నత చదువులు వరకు కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడి, కేంద్రంలో అనేక మంత్రి పదవులు చేపట్టి ఈ దేశానికి ఉపప్రధానిగా పనిచేసిన ఆయన ఆదర్శప్రాయుడిగా ప్రజల్లో చిరకాలం నిలిచారన్నారు.
నేటి రాజకీయాల్లో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు కొనియాడారు.
చదువుకుంటూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఆయన్ని మహాత్మా గాంధీ అనేక ఉద్యమాల సందర్భంగా ఆయన్ని అభినందించారు, పాఠశాలలో ఓ రోజు ఈయన ప్రసంగానికి ప్రభావైతులైన మదన్ మోహన్ మాలవ్య హిందూ బెనారస్ యూనివర్సిటీలో ఉన్నత స్థాయి చదువులను చదివించారని వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు గోపాల్, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు,
ముదిగొండ మండల పార్టీ అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, నేలకొండపల్లి పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, ఖమ్మం నగర కార్పొరేటర్ షేక్ మక్బుల్, దండా జ్యోతి రెడ్డి, మాజీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు హెచ్ ప్రసాద్, నాయకులు బంక మల్లయ్య, వీరభద్రం, చెరుకుపల్లి బిక్షం, కోటి అనంత రాములు, మాటేటి కిరణ్, నెమలి కిషోర్,ఆరంపల వీరభద్రం, కోడి వీరబాబు, సైదా హుస్సేన్, కంచర్ల పుల్లారావు, మాధవి ఉద్యమకారులు పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, కోడిరెక్క ఉమాశంకర్, మరియు షేక్ షకీనా, వీరేంద్ర, పల్లా రాజశేఖర్, నారమళ్ళ వెంకన్న, వీరేందర్,ఉస్మాన్, తదితర నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.
