Home వార్తలుఖమ్మం ఖమ్మం బీకె బజార్ లోని టూ వీలర్స్ మెకానిక్ షాప్ లను సందర్శించి మెకానిక్ అసోసియేషన్ బాధ్యులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం బీకె బజార్ లోని టూ వీలర్స్ మెకానిక్ షాప్ లను సందర్శించి మెకానిక్ అసోసియేషన్ బాధ్యులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్

by VRM Media
0 comments

Vrm media

కార్మికులు ఉపాధితో పాటు కుటుంబ భద్రత పై దృష్టి పెట్టాలి… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం బీకె బజార్ లోని టూ వీలర్స్ మెకానిక్ షాప్ లను సందర్శించి మెకానిక్ అసోసియేషన్ బాధ్యులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్

టూ వీలర్స్ మెకానిక్ ల సమస్యలను తెలుసుకుందుకు గురువారం నేరుగా బీకే బజార్ లోని షాపులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. మెకానిక్ యూనియన్ సభ్యులతో కలెక్టర్ మాట్లాడారు. కాల్వొడ్డు లోని తీగల వంతెన నిర్మాణంతో కొన్ని టూ వీలర్ మెకానిక్ షాపులు పోతున్నాయని ప్రత్యామ్నాయంగా వారికి అక్కడే ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణం లో నిరుపయోగంగా ఉన్న షాపులను కేటాయించాలని కోరారు. షాపు అభివృద్ధి కోసం బ్యాంకులు లోన్ ఇవ్వడం లేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మీరు వృతి పనిలో శ్రమ చేస్తున్నందన మీతోపాటు కుటుంబాల భద్రతకు భీమా కల్పించుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పధకం దరఖాస్తులు నమోదు చేసుకోవాలని అర్హత కలిగి వారికి లోన్ అందేలాగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెకానిక్ ల భద్రత, కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక యోచన చేయనున్నట్లు కలెక్టర్ అన్నారు. కలెక్టర్ పిల్లల చదువులు, కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఖమ్మం టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. కొండల్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అన్వర్, ప్రధాన కార్యదర్శి ఎల్. మురళి తదితరులు ఉన్నారు.

2,816 Views

You may also like

Leave a Comment