
ఆదర్శప్రాయుడు వనజీవి రామయ్య మృతికి ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ తీవ్ర సంతాపం
ఖమ్మం ఏప్రిల్ 12:
కోటి మొక్కలు నాటిన స్ఫూర్తిప్రదాత, యావత్తు దేశం గర్వించే మహోన్నత వృక్షం, భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు వనజీవి రామయ్య మృతి పట్ల ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ టియుడబ్ల్యూ జె(టి జేఎఫ్) అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డిలు ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి కి చెందిన దరిపల్లి రామయ్య (80) తన ఇంటి పేరునే వనజీవి రామయ్య గా సమాజానికి పరిచయం లేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్న ఆదర్శ ప్రాయుడని, సకల జీవరాసులకు ప్రాణవాయువుగా దేశం యావత్తు గర్వించేలా కోట్లాది మొక్కలను నాటి పద్మశ్రీ అవార్డుకే వన్నెతెచ్చిన మహోన్నత వ్యక్తి వనజీవి రామయ్య అని కొనియాడారు.
ఆయన ఆశయం భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమని కొనియాడారు.
వనజీవి రామయ్య మృతి దేశానికి తీరనిలోటని, ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

