Home వార్తలుఖమ్మం *కలెక్టరేట్ వద్ద గల సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి తుమ్మల

*కలెక్టరేట్ వద్ద గల సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి తుమ్మల

by VRM Media
0 comments

Vrm media venkat

కార్పోరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం …. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు

*కలెక్టరేట్ వద్ద గల సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి తుమ్మల

ఖమ్మం, ఏప్రిల్ -12:

కార్పోరేట్ స్కూల్ కు దీటుగా ప్రభుత్వ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

శనివారం మంత్రి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి తో కలిసి కలెక్టరేట్ వద్ద గల సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవంలో పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రపంచంలో మన పిల్లలు దీటుగా నిలబడాలనే లక్ష్యంతో యూకే కేంబ్రిడ్జి కరికులంతో సెడార్ వ్యాలీ పాఠశాల నిర్వహించడం సంతోషమని అన్నారు. సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రజలకు రీజనబుల్ ఫీజులతో హైదరాబాదులోని కార్పొరేట్ స్థాయికి దీటుగా సదుపాయాలతో బోధన అందుతుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్పోరేట్ స్థాయిలో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనం నిర్మించిన తర్వాత నిర్వహణ పకడ్బందీగా చేసేందుకు కూడా ప్రణాళికలు తయారు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండే పాఠశాలలు రావాలని, తల్లిదండ్రుల ఆశలు నేరవేర్చాలని మంత్రి స్కూల్ యాజమాన్యానికి తెలిపారు.

ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, 6 నెలల క్రితం వచ్చినప్పటికీ నేటికి చాలా మార్పు ఈ పాఠశాలలో వచ్చిందని, అందుబాటులో ఉన్న 6 ఎకరాల స్థలంలో స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ తయారు చేయడం ప్రశంసనీయమని ఎంపీ అభినందించారు. ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో కేంబ్రిడ్జి కరికులంతో విద్యా బోధన తీసుకురావడం జరిగిందని అన్నారు.

అంతకుముందు స్కూల్ పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్స్ట్రుమెంట్ ప్లే విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త మాజీ ఇస్రో మిషన్ డైరెక్టర్ డాక్టర్ టి.కె. సుందర మూర్తి, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ, ఆర్ అండ్ బి అధికారులు,

కరెస్పాండెంట్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Vrm media venkat

2,831 Views

You may also like

Leave a Comment