ది. 15.04.2025
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు ఆఫీసర్ కు సన్మానం
ఉద్యోగ విరమణ పొందిన సత్తుపల్లి యూనిట్ హోంగార్డు ఆఫీసర్ మిట్టపల్లి వాణి ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని పోలీస్ కమీషనర్ కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఖమ్మం జిల్లా హోంగార్డ్స్ యూనిట్ ఆఫీసర్ ఆర్ ఐ శ్రీ ఎం సురేష్, హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్, ఖమ్మం జిల్లా హోం గార్డ్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బంక శ్రీను, జాతీయ ఉపాధ్యక్షులు E వేంకటేశ్వర్లు, నీరజ, డి .రమేష్ డి.రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird