Home వార్తలుఖమ్మం ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్లజోళ్లను అందజేసిన ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు

ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్లజోళ్లను అందజేసిన ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు

by VRM Media
0 comments

ది.16.04.2025
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …

ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్లజోళ్లను అందజేసిన ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు

వేసవి ప్రారంభం కావడంతో ట్రాఫిక్‌ పోలీసు సిబ్బంది ఎదుర్కొనే అవస్థలను కొంత వరకు తగ్గించడానికి పోలీస్ ఉన్నతాధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించే సిబ్బందికి చలువ కళ్లజోళ్లను బుధవారం పంపిణీ చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సిబ్బందికి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ఉద్దేశ్యంతో నగరంలోని బిలీఫ్ హాస్పిటల్ సౌజన్యంతో అందజేసిన చలువ కళ్లజోళ్లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, మేడంపూడి రామజ్యోతి, (బిలీఫ్ హాస్పిటల్స్ మేనేజంగ్ డైరెక్టర్) చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ …ఎండ తీవ్రతను తట్టుకొని విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి కంటికి ఎలాంటి ప్రమాదం కలగకుండా అందజేసిన చలువ అద్దాలను ప్రతీ ఒక్కరు చక్కగ సద్వీనియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో సిఐ మోహన్ బాబు, ఆర్ ఐ సాంబశివరావు, ఎస్సై వెంకన్న, సాగర్, రాము పాల్గొన్నారు.

Vrm media

2,845 Views

You may also like

Leave a Comment