Home kothagudem *రఘునాథపాలెం మండలంలో సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన చేసిన మంత్రి తుమ్మల

*రఘునాథపాలెం మండలంలో సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన చేసిన మంత్రి తుమ్మల

by VRM Media
0 comments

Vrm media prathinidhi

పేదలకు సన్న బియ్యం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు

*500 రూపాయల బోనస్ తో పెరిగిన సన్న బియ్యం సాగు

*సన్న బియ్యం పంపిణీతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ కు అడ్డుకట్ట

*రఘునాథపాలెం మండలంలో సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం, ఏప్రిల్ -19:

దేశంలో పేదలకు సన్న బియ్యం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా శనివారం రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో లబ్ధిదారుడు గుడిబండ్ల రాజారావు ఇంటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పోలీసు కమీషనర్ సునీల్ దత్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ లతో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ కూలీ చేసుకునే కుటుంబం నేడు సంతోషంతో సన్న బియ్యం భోజనం చేస్తున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వాలు రేషన్ కార్డుల ద్వారా అందించే దొడ్డు బియ్యం బయట మార్కెట్ లో 10 రూపాయలకు అమ్ముకొని, కూలీ చేసిన డబ్బులతో సన్న బియ్యం కొనుక్కోవాల్సి వచ్చేదని తెలిపారని, ప్రస్తుతం ప్రతి సభ్యునికి ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో సంతోషంగా భోజనం చేస్తున్నారని మంత్రి అన్నారు.

సన్న బియ్యం పంపిణీ ద్వారా రైతులకు కూడా లాభం జరగాలని ప్రభుత్వం క్వింటాల్ సన్న ధాన్యంపై మద్దతు ధరతో పాటు, 500 రూపాయల బోనస్ చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసిందని అన్నారు. గతంలో దిగుబడి అధికంగా వస్తుందని రైతులంతా దొడ్డు బియ్యం మాత్రమే సాగు చేసేవారని, నేడు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ కారణంగా 20 శాతం ఉన్న సన్న వడ్ల సాగు ఇప్పుడు 80 శాతం వరకు పండిస్తున్నారని అన్నారు.

పేదలు కూడా ధనవంతులు లాగా సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని, సన్న బియ్యం పంపిణితో రీసైక్లింగ్ కు అడ్డుకట్ట వేశామని అన్నారు.

సన్న బియ్యం పంపిణీ అర్హులకు మాత్రమే అందాలని ఎక్కడా పక్క దారి పట్టకుండా అధికారులు జాగ్రత్త వహించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పథకాన్ని పేదలు సక్రమంగా వాడుకోవాలని మంత్రి కోరారు.

అంతకుముందు రఘునాథపాలెం మండలం బూడిదంపాడు -పుటాని తండా జెడ్పి రోడ్డు నుంచి వాంకుడో త్ తండా రోడ్డు వరకు 2 కోట్ల 50 లక్షలతో చేపట్టిన బి.టి రోడ్డు నిర్మాణం, బూడిదంపాడు ఎస్సీ కాలనీ నందు 80 లక్షలతో చేపట్టిన అంతర్గత సిసి రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, ఆర్ అండ్ బి రోడ్డు నుండి బూడిదంపాడు గ్రామం వరకు రూ. 150 లక్షల అంచనాలతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ దీక్షా రైనా, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Vrm media

*రఘునాథపాలెం మండలంలో సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన చేసిన మంత్రి తుమ్మల
*రఘునాథపాలెం మండలంలో సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన చేసిన మంత్రి తుమ్మల
2,855 Views

You may also like

Leave a Comment