Home వార్తలుఖమ్మం చోరీ నిందుతుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు : ఇన్స్‌పెక్టర్ ఉదయ్ కుమార్

చోరీ నిందుతుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు : ఇన్స్‌పెక్టర్ ఉదయ్ కుమార్

by VRM Media
0 comments

ది.01.04.025
VRM media

చోరీ నిందుతుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు : ఇన్స్‌పెక్టర్ ఉదయ్ కుమార్

జల్సాలకు అలవాటుపడి
ఇంటి దొంగతనాలు, బైక్ దొంగతనాలు చేస్తూ నేరాల బాట పట్టిన భద్రాచలం ప్రాంతానికి చెందిన అలవాటు పడిన నిందుతుడు కోడి శేఖర్@ జంపన్న ను ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిట్లు ఇన్స్‌పెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు.

ఈరోజు ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచాక్షరీ కాలనీ,వెలుగుమట్ల ప్రాంతంలో నిందుతుడు వున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. విచారణలో నగరంలోని ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో నిందుతుడితో కలసి తొమ్మిది దొంగతనాలు పాల్పడినట్లు నిందుతుడు తెలిపినట్లు వివరించారు. నిందుతుడు నుంచి 10 గ్రాముల బంగారు ఆభరణం, 04 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందుతుడు పరారీ వున్నట్లు తెలిపారు.

నిందుతుడిని పట్టుకోవడం కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ హరికృష్ణ, బోరయ్య లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్, టౌన్ ఏసీపీ రమణమూర్తి అభినందించారు. vrm media

2,868 Views

You may also like

Leave a Comment