ఖమ్మం నగరం లోని ప్రశాంతి నగర్ మరియు ఎన్ఎస్పి కెనాల్ వద్ధ కోతుల బెడద భరించలేకపోతున్నామని ఏరియా వాసులు మరియు వాకింగ్ చేసే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కోతులు ఇళ్లలోకి జొరబడి ఏది దొరికితే అది ఎత్తుకెళ్లుతున్నాయని, మందలించబోతే మీదపడి కరుస్తున్నాయని, చేతిలో సంచిలను ఏదైనా తీసుకుని వీధుల్లో నడుస్తున్న వారిపైనా దాడి చేసి గాయపర్చుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కోతుల బెడద తీవ్రతను 6వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నాగండ్ల కోటేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాలనీవాసులతో కార్పొరేటర్ సమావేశమై చర్చించారు. తదుపరి రోజు మున్సిపల్ కమిషనర్ తో కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు గారు మాట్లాడి కోతులు పట్టేవారిని పిలిపించి కోతులను పట్టించి, అటవీ ప్రాంతంలో వదలాలని కమిషనర్ తో మాట్లాడారు ఈరోజు కోతులు పట్టే వారు వచ్చి కోతులను పట్టుకొని అడవి ప్రాంతాల్లో వదిలిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు ఆనందంతో కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు గారిని కృతజ్ఞతలు తెలిపారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird