Home వార్తలుఖమ్మం *సన్న బియ్యం సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్, సి.ఎస్.

*సన్న బియ్యం సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్, సి.ఎస్.

by VRM Media
0 comments

Vrm media

*రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలి….. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

*13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉచిత సరఫరా

*నూతన రేషన్ కార్డు దరఖాస్తుల స్క్రూటిని వేగవంతం చేయాలి

*సన్న బియ్యం సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్, సి.ఎస్.

ఖమ్మం, ఏప్రిల్ -04:

రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి, సన్న బియ్యం సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 40 రూపాయలు పైగా కిలో బియ్యానికి వెచ్చించి ప్రజలకు ఉచితంగా దొడ్డు బియ్యం సరఫరా చేశామని, చాలా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసి ప్రజలకు బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ 70 నుంచి 80 శాతం వరకు ఆ బియ్యాన్ని ప్రజలు తినేవారు కాదని, రీసైక్లింగ్ ద్వారా కోళ్ల ఫారాలకు, ఇతర అవసరాలకు తరలి వెళ్లేదని తెలిపారు.

మన రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేసారని, దీనిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, పేదలు, ప్రజలు సన్న బియ్యం సంతోషంతో స్వీకరిస్తున్నారని అన్నారు.

రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా రవాణా వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి సన్న బియ్యం రవాణాపై కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, సన్న బియ్యం సరఫరా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా లాంచ్ చేయడం జరిగిందని, దీనికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ షాపుల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగి పోతున్నందున బియ్యం రవాణా వేగవంతం చేయాలని, రేషన్ షాపుల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో పెట్టాలని అన్నారు. పేదల ఇంటికి సన్న బియ్యం సరఫరా అతి గొప్ప విజయమని అన్నారు. నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల స్క్రూటిని వేగవంతం చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Vrm media

2,851 Views

You may also like

Leave a Comment