ది.05.04.2025
vrm media
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళి
భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘన నివాళి అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకుంన్నారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలోనూ… ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని కొనియాడారు.సమసమాజ స్థాపన కోసం బాబూ జగ్జీవన్ రామ్ జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రవీందర్ రెడ్డి, సిఐలు స్వామి, రమేష్, RI కామరాజు ,సెక్షన్ సూపరిండెట్ జానకి రామ్, ఐటి కోర్ టీమ్ ఎస్సై సత్యనారాయణ పాల్గొన్నారు.

