ఇంటర్ స్టేట్ ర్యాంక్ సాధించిన అడపాల హాసినికి అభినందనలు
మంగళవారం ప్రకటించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి స్టేట్ లెవెల్ లో సత్తా చాటిన ఖమ్మం నగరంలోని మధురానగర్ ప్రాంతానికి చెందిన చిరంజీవి అడపాల హాసిని కి కాలనీవాసులు అభినందనలు తెలిపారు. 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమతం రామకృష్ణ ఆధ్వర్యంలో హాసినితో కేక్ కట్ చేయించి మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. చదువులో మంచి ప్రతిభ కనబర్చుతు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. అనంతరం చిరంజీవి హాసిని తల్లిదండ్రులు అడపాల నాగేందర్ స్వరూపరాణి దంపతులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ నాయకులు బమ్మిడి శ్రీనివాస్ యాదవ్, మేడూరి కృష్ణారావు, హాసిని నానమ్మ, తాతయ్య పాల్గొన్నారు.
