Vrm media
నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలి…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
ప్రతి కొనుగోలు కేంద్రం లో ప్యాడి క్లీనర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
సీరియల్ నెంబర్ ప్రకారం రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్, తల్లాడ మండలంలో పర్యటించారు. కుర్నవల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం బైక్ పై ప్రయాణించి ఐకేపి ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాలలో నిర్వహిస్తున్న రిజిష్టర్లు, ధాన్యం తేమశాతం, గన్నీ బ్యాగుల లెక్కలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఏలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని, ప్రతి కొనుగోలు కేంద్రంలో బోర్డు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు టార్పాలిన్ పట్టాలు, గన్నీ బ్యాగులు ఎన్ని ఉన్నాయో స్పష్టమైన వివరాలు ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన ధాన్యానికి కూడా కోతలు విధించాలని ప్రయత్నిస్తే, కొనుగోలులో సమస్యలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్ గా చెక్ చేయాలని, తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని , నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం తరలింపు సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ సమస్యలు రాకుండా ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అలాట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని సూచించారు. రవాణా సమస్య రాకుండా అవసరమైన లారీలు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు . ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డేటా ఎంట్రీ చేయాలని అన్నారు.




VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird