
యాంకర్….. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా నిరంతరం అక్షర పోరాటం చేసే జర్నలిస్టులకు ప్రజాదరణ ఉంటుందని సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు. జర్నలిస్టుTv CEO మారెడ్డి నాగేందర్ రెడ్డిని ఉత్తమ జర్నలిస్టు అవార్డు వచ్చిన సందర్భంగా పూర్వ జర్నలిస్టుల మిత్ర బృందం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.సీనియర్ జర్నలిస్టులు ప్రసేన్,మధు,
సాంబశివరావు,ఆదినారాయణ,
నరసింహారావు,అర్భన్ శ్రీను,
విజేత,పుల్లారావు,చలమయ్య,
వెంకటేశ్వరరావు,మహేష్,
ఖదీర్,శ్రీనివాసరెడ్డి,వేణు, సీతారామ్,లక్ష్మణశర్మ,ప్రసాద్, శ్రీనివాస్,యాకేష్,భూపాల్,నాగరాజు తదితరులు మాట్లాడారు.
ఒకప్పుడు జర్నలిస్టు వృత్తి ఎంతో గౌరవప్రదంగా ఉండేదని తెలిపారు.గతంలో ప్రజా సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వాలు తెలుసుకుని పరిష్కరించేవారని పేర్కొన్నారు. మీడియాలో పరిస్థితులు రోజు,రోజుకు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.విలువలతో కూడిన జర్నలిజానికి సీనియర్లు తోడ్పాటు అందించాలని సూచించారు.
మూడు దశాబ్దాల నుంచి వివిధ మీడియా సంస్థలలో తనదైన ముద్ర వేసుకున్న మారెడ్డి నాగేందర్ రెడ్డికి ఉత్తమ అవార్డు ఇవ్వడం హర్షనీయం అన్నారు.మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.పూర్వ జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకువచ్చిన అర్భన్ శ్రీను,విజేతలను సీనియర్లు అభినందించారు.
