ఖమ్మం న్యాయవిభాగం, ఖమ్మంలోని ఎన్ఎస్టి రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ సాదిక్ రూపాయలు 41,61,405 లకు స్థానిక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంగళవారం ఐపి దాఖలు చేశారు. మొత్తం 22 మంది రుణదాతలను ప్రతివాదులుగా చేర్చారు. కేసు వివరాల ప్రకారం పిటిషనర్ సాదిక్ 2005 నుంచి మున్సిపల్ కార్యాలయం రోడ్ లో హెచ్ఎం సైకిల్ స్టోర్స్ పేరుతో వ్యాపారం నిర్వహించారు. అనంతరం ఆ సైకిల్ షాప్ పక్కనే హెచ్ఎం ఐస్ ప్లాంట్ పేరుతో ఐస్ ప్లాంట్ బిజినెస్ మొదలుపెట్టారు. ఈ రెండు వ్యాపారాలు అభివృద్ధి కోసం రుణదాతల వద్ద అప్పులు తీసుకున్నారు. కోవిడ్ తో పాటు ఇతర కారణాలవల్ల వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో రుణదాతలకు అప్పులు చెల్లించలేకపోయానని, తనను దివాలాదారులుగా ప్రకటించాలని కోరుతూ అడ్వకేట్స్ : అద్దంకి ప్రవీణ్,రవికుమార్ కుంభం, అద్దంకి మధు ల ద్వారా కోర్టులో ఐపి దాఖలు చేశారు.
