Vrm media
నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి…… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు
*రిటైనింగ్ వాల్ నిర్మాణం సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలి
*రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు
*పర్యాటక అభివృద్ధి పనులకు విస్తృత ప్రచారం కల్పించాలి
*ఖమ్మం ఖిల్లా రోప్ వే రోడ్డు సాధ్యమైనంత విస్తరించాలి
*జూన్ 2026 వరకు ఖమ్మం ఖిల్లా రోప్ వే ప్రాజెక్టు పూర్తి
ఖమ్మం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయడం పట్ల అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
శనివారం మంత్రి, ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి ధాన్యం కొనుగోలు, మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, జాతీయ రహదారుల పురోగతి, వెలుగు మట్ల అర్బన్ పార్క్, పర్యాటక అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత సంవత్సరం వచ్చిన భారీ వరదల నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల ప్రకారం చేసిన డిజైన్ మార్పుల మేరకు మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం పక్కాగా జరగాలని, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖమ్మం నగర వాసులు మరోసారి ఇబ్బందులకు గురి కావద్దని ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు మంజూరు చేశామని, పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రింద సేకరించిన భూములను అభివృద్ధి చేసి మున్నేరు నది రిటైనింగ్ వాల్ భూ నిర్వాసితులకు అందించేలా రైతులతో చర్చలు జరపాలని మంత్రి తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించాలని, రెండు వైపుల నుంచి ప్రణాళికాబద్ధంగా పని జరగాలని అన్నారు.
3 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద ఉధృతి తట్టుకునేలా 8.5 కిలోమీటర్లకు పైగా రిటైనింగ్ వాల్ రెండు వైపులా పూర్తి చేయాలని, ఇప్పటి నుండి సంవత్సర కాలంలోగా పనులు పూర్తి కావాలని అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, ఏజేన్సీ అదనపు బృందాలు ఏర్పాటు చేసి పనులు చేయాలని అన్నారు.
నాగార్జున సాగర్ లో తెగిపోయిన యూ.టి వెంటనే పునః నిర్మించాలని అన్నారు. మే నెలలో ఆ పనులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. షటర్స్ దగ్గర ఏవైనా మరమ్మత్తులు ఉంటే చేపట్టాలని అన్నారు. మంచుకొండ లిఫ్ట్ దగ్గర హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పనులు ప్రతిపాదించాలని అన్నారు.
ఖమ్మం నగరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్రింద 8.5 కిలో మీటర్ల మురుగు నీటి కాల్వ పూర్తి స్థాయిలో నిర్మించాల్సి ఉంటుందని అన్నారు. ఆక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. శాశ్వత ప్రాతిపదికన పనులు జరగాలని అన్నారు. ఎస్టిపి ద్వారా శుద్ది చేసిన మురుగు నీటినీ మనం ఖమ్మం నగరంలో గార్డెనింగ్, మొక్కల పెంపకం, ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని అన్నారు.
జిల్లాలో రైస్ మిల్లర్లపై మనకు కమాండ్ ఉండాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు రాక ధాన్యం కొనుగోలు సమస్యలు అధికంగా ఉన్నాయని, అకాల వర్షాలకారణంగా రైతులు నష్టపోతున్నారని, రవాణా కాంట్రాక్టర్ లతో చర్చించి ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంచి, రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు.
వెలుగు మట్ల అర్భన్ పార్క్ లోజరుగుతున్న అభివృద్ధి పనులకు విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. రెగ్యులర్ గా పత్రికల్లో వార్తలు వచ్చేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. జిల్లాలో ఆర్ & బీ, పంచాయతీ రోడ్లకు ఇరు వైపులా ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని అన్నారు.
ఖమ్మం ఖిల్లా రోడ్డు సాధ్యమైనంత వరకు విస్తరించాలని అన్నారు. ఖిల్లా రోప్ వే పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అన్నారు. రోప్ వే స్టేషన్ దగ్గర వరకు ప్రయాణికులు వచ్చేలా చూడాలని మంత్రి సూచించారు.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వరకు జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లు వచ్చేలా కృషి చేయాలని అన్నారు. ధంసలాపురం ఎగ్జిట్ దగ్గర రైల్వే లైన్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణ శంకుస్థాపన త్వరలో జరుగుతుందని, ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి అవసరమైన ప్రతిపాదనలు అందించాలని అన్నారు. జిల్లాలో అన్ని ఆసుపత్రుల పరిసరాలను పరిశుభ్రంగా చేయాలని, పాత సామాను పూర్తిగా తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
*ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రతి రోజు నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు జరగాలని సంబంధిత ఏజెన్సీలకు సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. నగరంలో జరిగే పర్యాటక అభివృద్ధి పనులకు విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
*జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన పట్టా భూముల సేకరణ కోసం రైతులతో చర్చలు జరుపుతున్నామని, నాగార్జున సాగర్ భూములను అభివృద్ధి చేసి పరిహారంగా అందిస్తామని చెప్పి రైతులను ఒప్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
ఖమ్మం జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇప్పటి వరకు 91 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర క్రింద 112 కోట్లు, సన్న రకం వడ్ల బోనస్ క్రింద 12 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన గన్ని బ్యాగులు, టార్ఫాలిన్ లు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ 29 కోట్లతో ఖమ్మం ఖిల్లా రోప్ వే ప్రాజెక్టు రూపకల్పన చేశామని, నగర కార్పొరేషన్ నుంచి కూడా 3 కోట్ల నిధులు వచ్చాయని, సాయిల్ టెస్టింగ్ పనులు జరిగాయని కలెక్టర్ తెలిపారు. జూన్ 2026 వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ వెలుగుమట్ల అర్భన్ పార్క్ అభివృద్ధికి 3 కోట్ల నిధులతో బటర్ ఫ్లై పార్క్, చిల్డ్రన్ పార్క్, వాటర్ ఫౌంటెన్, బోటింగ్ పనులు మే నెలాఖరు వరకు పూర్తవుతాయని అన్నారు. హరిత నిధి ద్వారా వచ్చిన 1.28 కోట్ల నిధులతో పార్క్ 110 హెక్టార్ల భూమి ఫెన్సింగ్, ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వెలుగు మట్ల అర్భన్ పార్క్ లో ప్లాస్టిక్ పూర్తిగా నిషేదించామని అన్నారు. 4.5 కిలో మీటర్ల మేర సైకిల్ ట్రాక్ పూర్తి చేశామని అన్నారు. నర్సరీ లో కమ్యూనిటీ కిచెన్ నిర్మించామని అన్నారు. పులిగొండ్ల ఎకో టూరిజం, వెలుగు మట్ల అర్భన్ పార్క్ ను 8 వేలకు పైగా విద్యార్థులు పర్యటించారని తెలిపారు.




VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird