
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం వైబియన్ పల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
రాజంపేటలోని వైబియన్ పల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ వినాయక అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆకు పూజ వడమాల పూజ నిర్వహించడం జరిగింది గ్రామంలోని మహిళలందరూ 108 సార్లు హనుమాన్ చాలీసా వేకు జామున్ నుంచి సామూహికంగా పట్టించడం జరిగింది. ఆలయ పూజారులు అప్పలాచారి శేషాద్రి స్వామి గార్ల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజల నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది భక్తులందరికీ ఉదయం అల్పాహారం వితరణ చేయడం జరిగింది ఆలయ ధర్మకర్త పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూశ్రీరాముడి ఆదరాభిమానాలు పొందిన వాడు..
సీతమ్మ జాడ కోసం అణువణువూ వెతికినవాడు..
ఎందరో రాక్షసులను వధించిన యోధుడు..
చూసి రమ్మంటే కాల్చి వచ్చిన ధీరుడు..
నాడు రామసేతును నిర్మించి లోక కల్యాణం కోసం పాటుపడి, నేడు ధర్మసేతు నిర్మాణానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా హిందూ బంధువులకు శుభాకాంక్షలలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు మహిళలు పాల్గొన్నారు