
Vrm media




ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య 46వ డివిజన్‌లో అంగన్వాడీ సెంటర్ స్థలాన్ని పరిశీలించారు
……………………
ఖమ్మం: నగర పాలక సంస్థ పరిధిలోని 46వ డివిజన్‌లో కొత్తగా అంగన్వాడి సెంటర్ నిర్మించడం కోసం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గురువారం స్థలాన్ని పరిశీలించారు. ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, చిన్నపిల్లలకు పోషకాహారం, విద్య మరియు ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించే లక్ష్యంతో ఈ సెంటర్‌ను నిర్మించేందుకు కసరత్తు ప్రారంభమైంది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “అంగన్వాడి సెంటర్ నిర్మాణం అనేది తల్లి–శిశు సంక్షేమానికి ఎంతో కీలకమైన అంశం. త్వరితగతిన ఎస్టిమేట్ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
స్థల పరిశీలనలో ఆ డివిజన్ కార్పొరేటర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో పాటు ఇంజనీరింగ్ విభాగం అధికారులు కూడా పాల్గొన్నారు. సదరు సెంటర్ నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక అంశాలను, అవసరాలను వారు కమిషనర్ వివరించారు.