నిర్బంధాలతో పోరాటాన్ని ఆపలేరు
విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెను నిర్బంధాలతో ఆపలేరని రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి వి శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల 5 రోజు జరుగుతున్న నిరవధిక సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు తెలిపిడానికి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ దీక్షా శిబిరానికి విచ్చేసి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా స్టీల్ డివిజన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి పాలకులు అధికారంలోకి రాక మునుపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించిందని వల్ల వేసి నేడు ఆ నిరంకుశ నిర్బంధ విధానాలను అనైతికంగా ప్రదర్శిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తుంటే దానికి వత్తాసుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించకపోవడం అత్యంత దుర్మార్గమని ఆయన వివరించారు. పాలకులు శ్రమను గుర్తించాలి, పెట్టుబడి కంటే శ్రమ గొప్పదని అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని గద్దెనెక్కి ఇప్పుడు మాట్లాడకుంటే ఆ ప్రజలే గద్దతించుతారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులపై ఉత్పత్తి ఆధారపడిందని దానిని ఎవరు కాదన్నా సత్యమని వారి జోలికి వస్తే ఆ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. కనుక సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ప్రధానితో మాట్లాడి కార్మికుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతును ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో విజయం సాధించడం కోసం మరింత ఐక్యంగా కార్మిక వర్గం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా జెఎసి అధ్యక్షులు ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ తో కార్మికులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా జెఎసిగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అఖిలపక్ష నాయకులు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి వారి మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. కనుక పోరాటాలపై ఉక్కు పాదంతో అనుచాలని ప్రభుత్వం ఆలోచిస్తే అది మరింత ఉధృతమై ప్రభుత్వంపై ఆ ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు.
సిపిఎం జాతీయ నాయకులు కె లోకనాథం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు స్వస్తి పలకాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఎఐటియుసి జాతీయ నాయకులు డి ఆదినారాయణ, స్టీల్ హెచ్ ఎం ఎస్ ప్రధాన కార్యదర్శి గణపతి రెడ్డి, స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్య రామ్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రజాస్వామ్యతంగా కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని నివారించాలని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని వారు అన్నారు. కానీ యాజమాన్యం ఎటువంటి స్పందన లేకుండా ఉండటం మంచిది కాదని ఒకసారి ఉత్పత్తికి అంతరాయం కలిగితే అది తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని వారు వివరించారు. కనుక సమ్మెను విరమించే పద్ధతిలో యాజమాన్యం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అఖిలపక్షం కార్మిక సంఘాల ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు మహిళలు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird