విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు దిగారు. తమను ఉద్యోగం నుంచి తొలగించేందుకు యాజమాన్యం కుట్ర పన్నుతోందని నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు. గతంలో 1150 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని గుర్తు చేశారు. మరో 5,500 మందిని తొలగించేందుకు రెడీ అవుతున్నారని ఆరోపించారు. ఈ రోజు వరకూ సమ్మె కొనసాగిస్తామని, యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు