Vrm media
అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి…. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి
ఖమ్మం, మే -5:
ప్రజల అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల అర్జీలను స్వీకరించారు.
రఘునాధపాలెం మండలానికి చెందిన సిహెచ్. కార్తిక్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్, పొన్నేకల్ లో 2023-24 విద్యా సంవత్సరంలో సి.ఎస్.ఈ. బ్రాంచ్ నందు చేరానని, అనివార్య కారణాలవల్ల చదువు ఆపివేసినప్పటికీ నా సర్టిఫికెట్స్ ను ఇవ్వకుండా నాలుగు సంవత్సరాల ఫీజు తీసుకురమ్మంటున్నారని, తన విద్యా సర్టిఫికెట్స్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా విద్యాశాఖ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుదిమళ్ళ గ్రామానికి చెందిన కే. శైలజ తనకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం రూరల్ మండలం ఎంపీడీవోకు రాస్తూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఖమ్మం అర్బన్ రామన్నపేటకు చెందిన ఎస్.కే. నాగుల్ మీరా తనకు బ్యాడ్జి లైసెన్స్ హెవీ లైసెన్స్ ఉన్నాయని, ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
వెలుగుమట్ల రెవెన్యూ గొల్లగూడెం గ్రామస్థులు తమ గ్రామంలో హిందూ స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ ఈ విభాగానికి రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, తదితరులు పాల్గొన్నారు.
Vrm media

