Home వార్తలుఖమ్మం ఆడపిల్లలున్న ఇల్లు సంతోషాల హరివిల్లు……. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఆడపిల్లలున్న ఇల్లు సంతోషాల హరివిల్లు……. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

by VRM Media
0 comments

Vrm media

ఆడపిల్లలున్న ఇల్లు సంతోషాల హరివిల్లు……. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

అమ్మాయి జన్మిస్తే ఇంటిల్లిపాది పండగ చేసుకోవాలి

మగవారితో సమానంగా ప్రతి రంగంలో మహిళలు ముందంజలో నిలుస్తున్నారు.*

ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామంలో ఆడపిల్ల జన్మించిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ అందించి, శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, మే -14:

సమాజంలో ఆడపిల్లలు ప్రతి రంగంలో రాణించి ఉత్తమ ప్రతిభతో మొదటి స్థానాల్లో ముందు ఉంటున్నారని, అడపిల్లలున్న ఇల్లు సంతోషాల హరివిల్లుగా నిలుస్తుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

ఆడపిల్లలు పుట్టడం అదృష్టమని తెలుపుతూ, ప్రతి బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మా పాప – మా  ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామంలో కోటేశ్వరి కుటుంబ సభ్యులు, అంగన్ వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు కలిసి రంగుల ముగ్గులతో వాకిలిని, మామిడి తోరణాలతో ఇంటిని ఆందంగా అలంకరించి కలెక్టర్ కు ప్రత్యేక ఆహ్వానంగా ఘనంగా స్వాగతించారు. గూడూరు కోటేశ్వరి- లక్ష్మినారాయణ రెడ్డి దంపతులకు 16 ఏప్రిల్, 2025న ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసి, వారి ఇంటికి వచ్చిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పాప తల్లిదండ్రులతో పాటు నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య లను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికెట్, పాపకు నూతన దుస్తులు అందించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. చేతులతో పాపను ఎత్తుకొని, పూలతో ముస్తాబుచేసిన ఊయలలో పాపను ఉంచి, ఊయలను ఊపుతూ చిన్నిపాప చిరునవ్వుకు కలెక్టర్ మురిసిపోయారు. ప్రపంచానికి ఆడపిల్లల అవసరం ఏలాంటిదో వివరించారు. మా పాప మా ఇంటి మణిదీపం ఆలోచనతో పాటు అమలు చేసే విధానంకు గ్రామస్ధులు అభినందనలు తెలియజేశారు.

ఆశా కార్యకర్తలు అందరూ కలిసి ఆడబిడ్డ సంరక్షణ అవగాహన కల్పించే విధముగా పాట రూపంలో పాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ అమ్మాయిల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, కుటుంబం భరోసా ఉండాలని తెలిపారు. ఆడపిల్లలు ప్రతి రంగంలో రాణించి మొదటి మూడు స్థానాల్లో వారే ముందు ఉంటున్నారని, మహిళలు అంతరిక్షానికి వెళ్లి వస్తున్న తరుణంలో తల్లిదండ్రులు తమ ఇంట్లో జన్మించిన ఆడపిల్లలకు అండగా ఉండి ఎదగనిచ్చి, మంచిగా చదివించి ఉన్నత స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఆనందాలతో నిండి ఉంటుందని, మగ పిల్లల కంటే ఎక్కువగా ప్రేమ, ఆప్యాయతతో ఉంటారని, వారిని ఎదగనిచ్చి, సమాజంలో ఒక స్థాయిలో ఉండేందుకు అండగా నిలవాలని అన్నారు.

ఆమ్మాయిలకు మంచి జీవితం అందించేందుకు ఆడబిడ్డలను గొప్పగా ఎదగనివ్వాలని, మనం ఆశించే మార్పు మన ఇంటి నుండే ప్రారంభించాలని, అమ్మాయి పుడితే ఇంటికి దేవత వచ్చిందని భావించాలని కలెక్టర్ సూచించారు.

ఖమ్మం జిల్లాలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారులు వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు స్వీట్ బాక్స్ ఇచ్చి, మంచి సందేశం అందించాలని, మహాలక్ష్మి ఇంట్లో పుట్టినందుకు శుభాకాంక్షలు తెలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా ఇంటికి కలెక్టర్ వచ్చి పాపకు ఆశీస్సులు అందించి, పాప భవిష్యత్తు గురించి చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని, కలెక్టర్ చెప్పిన విధంగా పాపను మంచిగా చదివించి ఉన్నత స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిద్దుతామని, పాప పెద్దయిన తర్వాత ఇంటికి కలెక్టర్ గారే స్వయంగా వచ్చి దీవించి వెళ్లారని తెలిపి ఈ నాటి మధుర క్షణాలను పంచుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, జిల్లా వైద్య, ఆర్యోగ శాఖ అధికారిణి డాక్టర్ బి. కళావతి బాయి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Vrm media

2,873 Views

You may also like

Leave a Comment