
కడప మహానాడును విజయవంతంగా నిర్వహించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు
సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి మే 30
కడప: తెలుగుదేశం పార్టీ తరపున కడప జిల్లాలో తొలిసారిగా నిర్వహించబడిన మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగియడాన్ని పురస్కరించుకొని, ప్రతిష్టాత్మక పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేశ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి. రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన మంత్రివర్యులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా, ఈ మహానాడుకు కడప వేదిక కావడం ప్రతి కడప తెలుగుదేశం కార్యకర్తకు గర్వకారణంగా నిలిచింది.
అలాగే, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన కడప జిల్లా ఇన్‌చార్జ్, మంత్రివర్యులు సబితమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు .
ఈ సందర్భంగా, కడప జిల్లాలో టీడీపీ బలోపేతం కావడం, కార్యకర్తల ఉత్సాహం నలుదిశలా ప్రతిధ్వనించడం చూసి మనసు గర్వం కలుగుతోంది అని నాగముని రెడ్డి గారు ఆనందం వ్యక్తం చేసారు. పార్టీలోని ప్రతి ఒక్కరు సమైక్యంగా ముందుకు సాగి రాబోయే రోజుల్లో పార్టీ కి ఇంక ఎన్నో విజయలు సాధించే దిశగా కృషి చేయాలి అని నాగముని రెడ్డి పిలుపునిచ్చారు