నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
ప్రైవేట్ ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకొనిపోకుండా చర్యలు తీసుకోవాలి.
ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్, 57వ డివిజన్ లో పర్యటించారు. స్థానిక కార్పోరేటర్ రఫిదా బేగం ముస్తఫా, అధికారులతో కలిసి రమణగుట్ట, వికలాంగుల కాలనీ, జగ్జీవన్ రాం కాలనీలోని పలు ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. కలెక్టర్ కాలినడకన నడిచి ఆ ప్రాంతాలలో శానిటేషన్, త్రాగునీరు, విద్యుత్ స్తంబాలు, సైడ్ కాలువలు, డ్రైనేజి, రోడ్లు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ ల్యాండ్ లను పరిశీలించి చెత్త పేరుకొని పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ ప్రాంతాలలో నిలిచిన మురుగు నీటి పరిస్థితులను చూసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో బురదకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
వికలాంగుల కాలనీలో శిధిలావస్ధలో ఉన్న పాఠశాలను తొలగించి కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలను సమర్పించాలని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. స్థానిక పిల్లలకు విద్యా బోధనకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Vrm media




VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird