Home వార్తలుఖమ్మం మానవాళి అభివృద్ధికి గొడ్డలిపెట్టు పొగాకు

మానవాళి అభివృద్ధికి గొడ్డలిపెట్టు పొగాకు

by VRM Media
0 comments
మానవాళి అభివృద్ధికి గొడ్డలిపెట్టు పొగాకు

Vrm media ఖమ్మం

మానవాళి అభివృద్ధికి గొడ్డలిపెట్టు పొగాకు

మే 31 ఖమ్మం: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ కమిటీ సభ్యులు శనివారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ. సొలవేసికు చెందిన ఒక చిన్న మొక్క ద్వారా తయారీ వల్ల పొగ విడుదల అవుతున్నందు వలన దీనికి పొగాకు అనే పేరు వచ్చిందని దీని ఆకుల నుండి సిగిరేట్లు తయారు చేస్తారని, దీన్ని కొన్ని తరాలు తాంబూలాల్లో కూడా ఉపయోగిస్తున్నారని క్రీస్తు పూర్వం 1400 ఏళ్ల నాడే పూర్వీకులు ఎంతగానో అభిమానించే వారని, కానీ అది మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని గ్రహించ లేదన్నారు. ఇప్పుడు ఆ పొగాకు ప్రాణాంతకంగా తయారైందని అన్నారు. పౌర సమాజం పొగాకును వ్యతిరేకాస్తుందని తెలియజేస్తూ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నందు 8 అడుగుల బాహుబలి సిగరేట్ ను తయారుచేసి పొగాకు ద్వారా ఉత్పత్తియ్యే పదార్థాలను వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. పెద్ద సంఖ్యలో పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ సభ్యులు యువత నడక సాదకులు, మహిళలు కలిసి సిగరేట్ బొమ్మపై సంతకాలు చేసి పొగాకును వ్యతిరేకాస్తున్నట్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ కమిటీ సభ్యులు ఇకనుంచి మేము మా కుటుంబం సభ్యులు, స్నేహితులు, బంధువులు ఎవరేమికాని పొగాకు పదార్దాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు.ప్రమాణం చేయడమే కాకుండా పొగాకు మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. సగటున దేశంలో కరోనా లాంటి మహామ్మారి వల్ల మరణించింది తక్కువే కానీ, పొగాకు వల్ల అనేక రోగాలు ఎదుర్కొంటు సుమారు 10 లక్షల మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నారని, ప్రభుత్వాలు వెంటనే పొగాకు ఉత్పత్తులు నిషేదించాలని పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ కమిటీ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో రాకం శ్యామ్ బాబు,విజయ్ కుమార్, వెంకట్, సుదర్శన్, మంద వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్, మాధవి,రమా, భాగ్య,రాజ్యలక్ష్మి, సబిత, తదితరులు పాల్గొన్నారు.

2,860 Views

You may also like

Leave a Comment