
సిద్ధవటం మండల తహసిల్దారుగా తిరుమల బాబు
భూ సమస్యల పరిష్కారానికి కృషి
సిద్ధవటం Vrm న్యూస్ మే 23
మండలంలోని ఎలాంటి భూకజ్జాలు జరిగిన వాటిపై శాఖ పరమైన చర్యలు చేపడతామని నూతన మండల తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన ఆకుల తిరుమల బాబు తెలిపారు
కడప ఆర్టీవో కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తూ పదోన్నతి పై సిద్ధవటం మండల తాసిల్దార్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ ప్రభుత్వ డీకేటి పట్టా భూములు అన్యాక్రాంతాలు చేపడితే చర్యలు తప్పవని ప్రజల అర్జీ సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి పరిష్కారం చేస్తామని భూకజ్జాల సమస్యలు ఏమైనా ఉంటే మండలప్రజలు నా దృష్టికి తీసుకురావాలని మండల ప్రజలకు తెలియజేశారు