పారెస్టు అనుమతులు వెంటనే ఇవ్వాలి
రోడ్డు పనులు ప్రారంభించాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లో ఉన్నటువంటి గుమ్మపంచాయితీ కల్యాణి గుమ్మి గ్రామానికి రోడ్డు సౌకర్యం నిమిత్తం పారెస్టు అనుమతులు ఇచ్చి వెంటనే రోడ్డు పనులు ప్రాంబించాలని డిమాండ్ చేస్తు ఆదివాసీ గిరిజనులు శనివారం చిన్న పిల్లలుతో సహ గిరిజనులు గోసిలు పెట్టుకోని వినూత్న రితిలో అందోళన చేస్తు రెండు చేతులెత్తి దండం పెడుతు పవన్ కల్యాణ్ బాబు రోడ్డు సౌకర్యం కల్పించాలని విన్నవించు కున్నారు, గిరిజనులు సమస్యలు ద్రుష్టిలో పెట్టుకోని ప్రభుత్వం నేరెళ్ళ పూడి నుండి కల్యాణి గుమ్మి వరకు బిటి రోడ్డు మంజూరు చేయడం జరిందని తెలిపారు పారెస్టు అదికారులు అనుమతులు ఇవ్వక పోవడంతో రోడ్డు నిర్మాణం పనులు నిలిచి పోయాయని గిరిజనులు, ఆవేదన వ్యక్తంచేశారు.
