Home ఆంధ్రప్రదేశ్ చలో మహానాడు: సిద్ధవటం మండలం నుంచి పెద్ద సంఖ్య లో కార్యకర్తలు ర్యాలీ లో

చలో మహానాడు: సిద్ధవటం మండలం నుంచి పెద్ద సంఖ్య లో కార్యకర్తలు ర్యాలీ లో

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ మే 27

సిద్ధవటం మండలం పాల్గొనాలని పిలుపినిచ్చిన పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి
కడప: చలో మహానాడు కార్యక్రమం కోసం సిద్ధవటం మండలము టక్కోలు నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి తొo మహానాడు పండుగ కోసం బయలుదేరారు. ఈరోజు, రేపు, ఎల్లుండి (మూడు రోజులు) కడపలో జరగబోయే తెలుగుదేశం పార్టీ మహానాడు మహాసభల సందర్బంగా స్థానికంగా పెద్ద ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా నాగముని రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు లోకేష్ నాయకత్వం చాలా కీలకం. ప్రతి కార్యకర్త ఈ మహానాడు సభలకు హాజరై తమ అంకితభావాన్ని చాటాలి” అని పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీలో చిన్నపరెడ్డి, వీరయ్య, వీరన్న, చంద్ర తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలస్థాయిలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి ప్రణాళికలతో కార్యకర్తలు ముందుకు వస్తుండటంతో మహానాడు ఘన విజయం సాధించబోతుందని అంచనా వేయబడుతోంది.

2,934 Views

You may also like

Leave a Comment