
విశాఖ ఉక్కు కర్మాగారంలో
కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే పోరాటం ఉద్ధృతం
తొలగించిన కార్మికులను యాజమాన్యం వెనక్కు తీసుకోక పోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్య దర్శి షేక్ రెహ్మాన్ హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికుల సమ్మె సోమవారం 7వ రోజుకు చేరుకున్న సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని సంఘీ భావం తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆర్. శ్రీనివాస్, క్షేత్రపాల్రెడ్డి, జి.రాంబాబు, నాగభూషణం, మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.
ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3): ఉక్కు ఒప్పంద కార్మి
ధర్నాలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న జె.అయోధ్యరామ్
కూర్మన్నపాలెం దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న షేక్ రెహ్మాన్
కుల సమస్య పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని, కర్మాగారాన్ని కాపాడాలని సిటూ గౌరవ అధ్యక్షులు జె. అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఒప్పంద కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలన భవనం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. తొలగింపులు ఆపాలని, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు సంఘాలు నాయకులు ఆదినారాయణ అయోధ్య రామ్, నాగరాజు, బైరెడ్డి, కె.ఎస్.ఎన్.రావు, పి.వి.రమ ణమూర్తి, యు. రామస్వామి, వై.టి.దాసు, కొమ్ము ప్రసాద్, శ్రీనివాసరాజు, ఒ.వి.రావు, తదితరులు పాల్గొన్నారు.